Vastu Tips : పసుపు, కుంకుమలు శుభానికి సూచికలు ఏ శుభకార్యం లోనైనా కూడా పసుపు, కుంకుమలను తప్పకుండా వాడుతుంటారు. ఈ రెండిట్లో ముఖ్యంగా కుంకుమకు ప్రత్యేక స్థానం ఉంది. శుభ కార్యాలకు ఉపయోగించే కుంకుమతో మంచి ఫలితాలు కలుగుతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం కూడా కుంకుమ ఇంటికి శుభాలు కలిగిస్తుంది. అయితే కుంకుమను ఎలా వినియోగించుకోవాలో చూద్దాం. ప్రతి రోజు మనం స్నానం చేసే నీటిలో కుంకుమను వాడుకుంటే మంచిది. ఆ తరువాత తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్జ్యం ఇస్తే మంచి ఆరోగ్యంతో పాటు,ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.
ఆంజనేయుడికి ఎంతో ఇష్టం అయినా మంగళవారం రోజున జాస్మిన్ అయిల్ తో కుంకుమను కలిపి, 5 వారాలు క్రమం తప్పకుండా ఆంజనేయస్వామికి సమర్పిస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు ,అనారోగ్య సమస్యలు అన్ని దూరమై ఆ స్వామి దయ మీ పైన ఉంటుంది.
ఇంటికి గాని ఇంట్లో వాళ్లకు కానీ దిష్టి తగిలినప్పుడు నీళ్లలో కుంకుమ కలిపి దిష్టి తీసి ఆ నీటిని ప్రవహించే నీటిలో కలిపివేయాలి. అలా చేస్తే వెంటనే మీపైన ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది. ప్రతి బుధవారం వినాయకుడికి కుంకుమతో అర్చన చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
ఇంటి గడపకు పసుపు పూయడం మన సాంప్రదాయం అలాగే కుంకుమను కూడా గడపకు పూయడం వల్ల మన ఇంటికి ఎన్నో శుభాలు కలుగుతాయి. నిండు ముత్తైదువలు పార్వతి దేవికి కుంకుమతో అర్చన చేస్తే సకల సౌభాగ్యాలు వారికి లభిస్తాయి.