Vastu Tips : కొంతమంది ఎంత సంపాదించినా కూడా వారి దగ్గర డబ్బు నిలవదు. కష్టానికి తగిన ఫలితం ఉండదు. అలా డబ్బులు నిలవకపోవడానికి గల కారణాలేంటి. మన ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయేమో అని చూసుకోవాలి. ఇంట్లో ఏ దిశ వైపు వాస్తు దోషాలు ఉన్నాయే అని గమనించాలి.
ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతుంటే వాటి నుండి బయటపడడానికి ఈశాన్య దిశలో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఈశాన్య దిశ అంటే లక్ష్మీ దిశ. డబ్బు రాకకు సంబంధించిన దిశ అని అర్థం. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే తీవ్ర ఆర్థిక నష్టాలకు గురి కావాల్సి ఉంటుంది. ఈశాన్య దిశ వైపు బరువైనా వస్తువులను అసలు పెట్టకూడదు.
అలా పెడితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను చూడాల్సి వస్తుంది. ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తా,చెదారం పెడితే డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. డబ్బులు వచ్చే మార్గాలు కూడా తగ్గిపోతాయి. ఈశాన్య దిశలో అన్ని వేళలా వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఆ దిశలో చీకటిగా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరగడమే కాక సమస్యలు తలెత్తుతాయి.
చాలామంది బీరువా తలుపులను దక్షిణం వైపు ఉండేలా పెడతారు. దక్షిణ దిశ యమదిశ. కాబట్టి అలా ఉంచడం వల్ల ఆర్థిక నష్టం పెరుగుతుంది. బీరువా తలుపును ఉత్తరం వైపు, బీరువా తలుపు లాకర్లు అలా పెట్టడం వల్ల ఆర్థికంగా బాగుంటుంది. డబ్బులు భద్రపరిచే చోటును కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది.
వాస్తు నియమాలు సక్రమంగా పాటిస్తే లక్ష్మీదేవి చల్లని చూపు ఆ కుటుంబం పైన ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో డబ్బు నిలవాలంటే దక్షిణం దిశ, ఈశాన్య దిశ విషయంలో, డబ్బులు పెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరి.