What Happens when Bats enter the House : గబ్బిలాలు మనకు ఎక్కువగా గుడి దగ్గర, చెట్ల మధ్యలో నివాసాలు ఏర్పరచుకొని కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవి జనావాసాలలో ఉండడం చాలా తక్కువ. అప్పుడప్పుడు ఇవి ఇళ్లలోకి చొరబడతాయి. అయితే గబ్బిలాలు ఇంట్లోకి వస్తే శుభమా..? అశుభమా..? ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ విషయంపై కొంతమంది అభిప్రాయం ఏమిటంటే, గబ్బిలాలు ఇంట్లోకి రావడం మంచిదే, గబ్బిలం లక్ష్మీదేవి వాహనం. ఇంట్లోకి వస్తే డబ్బుకు కొదవ ఉండదని అభిప్రాయపడతారు. మరికొందరు గబ్బిలాలు రాత్రి సమయంలో ఎవరైనా ఇంటికి వస్తే ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని బాగా నమ్ముతారు. ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే వైవాహిక జీవితంలో కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కొన్ని వేలల్లో గబ్బిలం రాక మరణానికి సంకేతం అని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. గబ్బిలం ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి ఒకవేళ పొరపాటున వస్తే మాత్రం వాటిని ఎట్టి పరిస్థితులలో కూడా చంపకూడదని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అనుకోకుండా గబ్బిలం ఇంట్లోకి వస్తే గుగ్గిలం పొగ వేసి ఇల్లు మొత్తం శుభ్రం చేయాలని ఆ రకంగా చేస్తే
దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్లిపోయిన తర్వాత, ఇంటిని శుభ్రం చేసిన తర్వాత, లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి ఆరాధించాలని, అలా చేస్తే గృహ శాంతి చేయించినట్లు జరుగుతుందని వారు తెలుపుతున్నారు. ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే గబ్బిలానికి చీకట్లో దారి తెలియక అవి బయటికి వెళ్లిపోతాయి. ఆ రకంగా ఇంట్లో నుంచి గబ్బిలాలను తోలవచ్చు.