• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home ఆధ్యాత్మికం

పాపం అంటే ఏమిటి ? పుణ్యం అంటే ఏమిటి ?

TrendAndhra by TrendAndhra
December 22, 2022
in ఆధ్యాత్మికం
0 0
0
పాపం అంటే ఏమిటి ? పుణ్యం అంటే ఏమిటి ?
Spread the love

 

మనుషులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు. కాని పుణ్యఫలాన్ని మాత్రం ఆశిస్తారు. పాపఫలితాన్ని ఆశించరు. కాని పాపకార్యాలను మాత్రం ప్రయత్న పూర్వకంగానే చేస్తారు అని ధర్మనీతి శాస్త్ర నిర్వచనం. ఇంతకీ పాపం అంటే ఏమిటి ? పుణ్యం అంటే ఏమిటి ?

“పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం” అంటే ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం.

పూర్వజన్మల్లో చేసిన పాప దోషాల వల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడుస్తున్నాయి అని మనం గ్రహించాలి.

పాపం వల్లనే దుఃఖాలు వస్తాయి. పాపం లేనప్పుడు ఆనందం కలుగుతుంది. ఏ కొంచెం దుఃఖం కలిగినా అది పాపఫలమే కాక వేరొకటి కాదు.

పాపదోషం అనుభవించితే తప్ప పోదు. అడవుల్లో ఉన్నప్పుడు, యుద్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్నిమధ్య ఉన్నప్పుడు, సముద్రంలో సాగుతున్నప్పుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో, సంకట పరిస్థితులలో మానవుడిని తాను పూర్వ జన్మలో చేసిన పుణ్యాలే కాపాడతాయి..!

“ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగి ఉండకపోవడమే అన్ని ధర్మాల్లోకి కూడా ఉత్తమమైన ధర్మం” అని విదురవాక్కు. పుణ్యం చేయడం చేతకాకున్నప్పుడు ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు.

ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేం. తాను చేసిన పాపకర్మ వల్లనే దుఃఖం కలుగుతుంది. తాను చేసిన పుణ్యకర్మ వల్లనే సుఖం కలుగుతుంది.

ఈనాడు మనం నవ్వుతూ చేసిన పాపకర్మకి రేపు ఏడుస్తూ దుఃఖాన్ని అనుభవించక తప్పదనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే అవకాశం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించాలి. భగవంతుని అనుగ్రహం పొందాలి.


Spread the love
Tags: Sin and VirtueTrend AndhraTrend Andhra NewsWhat is sin?What is the difference between sin and virtueWhat is Virtue and Sin?What is virtue?What is your essence of Sin and Virtue?ఆధ్యాత్మికంభక్తి
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.