Worshipping Shell at Home : విష్ణు పురాణం ప్రకారం లక్ష్మీదేవి శంఖంలో నివాసం ఉంటుందని చెబుతారు. చాలామంది ఇంట్లో పూజ గదిలో శంఖాన్ని ఉంచి ఆ శంఖానికి పూజలు చేస్తారు. అలా చేయడం వల్ల వారి సమస్యలు తొలగిపోయి ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుందని బాగా విశ్వసిస్తారు. అలాగే ఇంటి ఆవరణలో శంఖాన్ని వదిలితే ఇల్లు మొత్తం శుభ్రం అవుతుందని కూడా చాలామంది భక్తులు నమ్ముతారు. హైందవ సంస్కృతిలో చాలా రకాలైన శంఖాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఇంట్లో ఏ రకమైన శంఖాన్ని ఉంచితే మంచి జరుగుతుందో తెలుసికుందాం..
కామదేను శంఖం : శంఖంలో అతి ప్రధానమైనది కామదేను శంఖం. దీని ఆకారం ఆవు నోరుల ఉంటుంది. ఈ శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు.
గణేష్ శంఖం : గణేష్ శంఖం కూడా ప్రత్యేకమైనదే. వినాయకుని పూజలో గణపతి శంఖాన్ని ఉంచి పూజించడం వల్ల, ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు లభించి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయని చెబుతుంటారు.
ముత్యాల శంఖం : ముత్యాల శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే ఆ ఇంటి వారికి మంచి జరగడమే కాకుండా, మనశాంతి లభించి ఇంట్లో సంతోషం నెలకుంటుందంట, దేవుడి గదిలో తెల్లటి వస్త్రంపై మోతీ శంఖాన్ని ఉంచి పూజిస్తే శుభప్రదమని చాలామంది భావిస్తారు.
ఐరావతి శంఖం : వీటితోపాటు ఐరావతి శంఖాన్ని కూడా ఇంట్లో ఉంచి పూజించడం వల్ల, ఇంటి యొక్క వాస్తు దోషాలు తొలగిపోయి, ఇంట్లో చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ శంఖాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచితే ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావని చాలామంది విశ్వసిస్తారు. ఈ శంఖంలోని నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కూడా నమ్ముతారు.
మణిపుష్పక శంఖం : కార్యాలయాలలో మణిపుష్పక శంఖాన్ని ఉంచడం వల్ల కీర్తి, గౌరవం పెరుగుతాయి. పని ప్రదేశాలలో ఉంచిన ఈ మణి పుష్పక శంఖం ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందేందుకు చాలా ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ సమస్యలను బట్టి మీ ఇంట్లో ఏ శంఖాన్ని ఉంచాలో నిర్ధారించుకోండి.