Peddi: జాన్వీ కపూర్‌తో కలిసి శ్రీలంకలో ల్యాండ్ అయిన రామ్ చరణ్.. ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌పై లీక్
Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న, బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ శ్రీలంకలో షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ విదేశీ షెడ్యూల్‌లో రామ్ చరణ్ – జాన్వీ కపూర్‌లపై ఒక రొమాంటిక్ పాటను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
వారం రోజుల పాటు సాగే ఈ కీలకమైన షెడ్యూల్‌తో పాట షూటింగ్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రత్యేక విమానంలో శ్రీలంకకు చేరుకున్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్సులో జాన్వీ కపూర్ ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే విడుదలైన ‘పెద్ది’ గ్లింప్స్‌లో చరణ్ పాత స్టైల్‌తో కూడిన కొత్త లుక్, ఆయన సిగ్నేచర్ షాట్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. అయితే ఆ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో, ఫస్ట్ సింగిల్‌పై వస్తున్న వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ సినిమా నుంచి మొదటి పాట (ఫస్ట్ సింగిల్) నవంబర్ 8న విడుదల కానుంది. సంగీత సంచలనం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఒక ప్రత్యేక ఈవెంట్‌లో ఈ పాటను ఆవిష్కరించనున్నారని బలంగా వినిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ ఈవెంట్ ప్రోమోలో ‘పెద్ది’ టైటిల్ ఫాంట్ కనిపించడం ఈ రూమర్‌కు మరింత బలం చేకూర్చింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తి కొత్త లుక్‌లో, ఇంతవరకూ సిల్వర్ స్క్రీన్‌పై చూడని స్టైల్‌లో కనిపించనున్నారని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఈ కథ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, బలమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ కలబోసినట్టుగా ఉంటుందని వారు తెలిపారు.
ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, గ్లింప్స్‌లో వినిపించిన బీజీఎం ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘పెద్ది’ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, 2026న పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఫస్ట్ సింగిల్ కోసం మెగా అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
