Pawan Kalyan On Instagram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏలూరులో వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్నారు. మరోవైపు పవన్ నటించిన బ్రో చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధంగా ఉంది. సముద్రఖని దర్శకత్వంలో వహించిన ఈ మూవీలో పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు. ఇదిలావుండగా పవన్ ఇటీవలే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.
పవన్ అకౌంట్ తెరిచిన కొన్ని గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ సృష్టించాడు. ఆ ప్రవాహం ఇంకా ఆగలేదు. ఇప్పటికే పవన్ ను 2.3 మిలియన్ యూజర్లు ఫాలో అవుతున్నారు. ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా అంత మంది ఫాలో అవడం అంటే మాములు విషయం కాదు. ఇంతకీ పవన్ ఫస్ట్ పోస్ట్ ఏం పెడతాడా అని అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. పవన్ ఫస్ట్ పోస్ట్ పెట్టాక ఫాలోవర్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Rajamouli – Mahesh Babu : అప్పుడే సూపర్ స్టార్ కి కండీషన్స్ పెట్టిన జక్కన్న.. అవేంటంటే..!
పవన్ కి సామాన్యులే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇన్స్టాలో పవన్ను ఫాలో అవుతున్నారు. అందులో స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. శ్రుతిహాసన్, కీర్తి సురేష్ తదితర అందాల తారలు పవన్ను ఫాలో అవుతున్నారు. బ్రో తో పాటు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు.