Rajamouli – Mahesh Babu : వరుస హిట్లతో సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారంలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల, మీనాక్షిచౌదరి హీరోయిన్లు కాగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్రివిక్రమ్, మహేష్ కలయికలో వచ్చే హ్యాట్రిక్ మూవీపై ఇటు గురూజీ అభిమానులకు, మహేష్ ఫాన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ దర్శకధీరుడు రాజమౌళితో SSMB29 చేయనున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే జక్కన్నతో మూవీ అంటే అంత ఈసీ కాదు.. ఆయనతో సినిమా చేసే హీరోలకు కండీషన్స్ మాములుగా ఉండవు. లుక్ బయటకు రాకూడదు, ఎక్కువగా ఈవెంట్స్‌కు హాజరు కాకూడదు. తన సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు ఇలా ఉంటాయి కండీషన్స్. ఇవేనా అనుకోకండీ.. రాజమౌళి మూవీలో యాక్షన్ సీన్స్ కోసం ముందే ట్రైనింగ్ ఇప్పిస్తాడు. ఇంతకు ముందు ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా కష్టపడ్డ వాళ్లే..
Ram Charan : లీకైన చరణ్, బుచ్చిబాబు RC16 స్టోరీ..
ఇప్పుడు సూపర్ స్టార్ వంతు.. జక్కన్న మహేష్ కి 3 నెలల ట్రైనింగ్ పీరియడ్ నిర్ణయించాడట. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ ట్రైనింగ్ ఉంటుందట. ఆ లోపు త్రివిక్రమ్ గుంటూరు కారం షూట్ కంప్లీట్ చేయాలని చెప్పినట్టు సమాచారం. మహేష్ బాబు బర్త్ డే ఆగస్ట్ 9న SSMB29 పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని టాక్. RRR తర్వాత రాజమౌళికి హాలీవుడ్ రేంజ్ లో మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో SSMB29 మూవీని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు.