Pawan Kalyan’s Strategy in Allotment of Seats : అధికార పార్టీ వైసీపీని ఓడించడానికి టిడిపి, జనసేన పొత్తులో భాగంగా చాలా వ్యూహాలే రచిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టిడిపి సభలు, సమావేశాలతో బిజీబిజీగా అవుతూ వైసిపి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారని చెప్పవచ్చు. అయితే జనసేన, టిడిపి పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించే విషయం పైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యలో వాడి వేడి చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా జనసేనకు 23 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలను కేటాయిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అయితే అధికారంగా జనసేనకు టిడిపి ఎన్ని సీట్లు కేటాయించిందని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఒక చర్చ నడుస్తుంది. పవన్ సీట్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తక్కువ సీట్లు వచ్చినా కూడా పర్వాలేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.
ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నది అనేది ఇక్కడ ముఖ్యం కాదని, పోటీ చేసిన సీట్లలో తప్పకుండా గెలుస్తామా లేదా అనేది ముఖ్యమని పవన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక టిడిపి తో పొత్తులో భాగంగా జనసేన తీసుకోబోతున్న సీట్లలో 98 శాతం గెలుస్తామని పవన్ కళ్యాణ్ దీమా వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవంగా పవన్ కళ్యాణ్ 175 అసెంబ్లీ స్థానాల్లో 35 స్థానాలకు జనసేన కేటాయించాల్సిందిగా ముందుగా చంద్రబాబును కోరారు. కానీ ఇప్పుడు చూస్తే అది కాస్త 23 సీట్లకే పరిమితం కావలసి వచ్చింది. ఈ మేరకు మరి జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గ వర్గాలన్నింటి నుంచి గెలుస్తుందా.. లేదా..? అని ఒక భావన ఏర్పడింది.
ముఖ్యంగా ఎంపిక చేసిన నియోజకవర్గాలు.. తెనాలి, విశాఖ నార్త్ లేదా సౌత్, అనకాపల్లి లేదా చోడవరం, నెలిమర్ల, పెందుర్తి, రాజోలు, కాకినాడ, పి గన్నవరం, పిఠాపురం, రాజమండ్రి, రూరల్ నరసాపురం, రాజానగరం, భీమవరం అమలాపురం, ఏలూరు లేదా కైకలూరు, దర్శి, తాడేపల్లిగూడెం, అవనిగడ్డ, పేడన, విజయవాడ వెస్ట్, రాజంపేట తిరుపతి లేదా,
చిత్తూరు ఈ లోకసభ నియోజకవర్గాల విషయానికొస్తే అనకాపల్లి, మచిలీపట్నం కాకినాడ లేదా తిరుపతి స్థానాలను జనసేన కేటాయించినట్లుగా ఒక ప్రచారం మాత్రం ఊపందుకుంది. అయితే దీనిపైన ఇంకా ఎటువంటి అధికార ప్రకటన మాత్రం రాలేదు. జనసేనకు, టిడిపి తక్కువ సీట్లను కేటాయించిందంటూ అప్పుడే జనసేన నాయకులు కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవేవీ పట్టించుకోకుండా ఒక వ్యూహం ప్రకారమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వెలుతున్నట్లుగా తోస్తుంది..