Varahi Vijaya Yatra : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి విజయయాత్రకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మొదటి దశ వారాహి విజయయాత్ర విజయవంతంగా పూర్తి చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్.. రెండో దశ యాత్రకు సిద్ధమయ్యారు. జూలై 9వ తేదీన ఏలూరు నుంచి వారాహి రెండో దశ యాత్ర ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే రెండో దశ యాత్ర ప్రణాళికపై గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు.
వారాహి విజయ యాత్ర షెడ్యూల్..
09-07-2023 : సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభ
10-07-2023 : మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి, సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం
11-07-2023 : మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం, సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటారు పవన్.
12-07-2023 : సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ