Varahi VijayaYathra : పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర విజయ పరంపర కొనసాగిస్తుంది. దాంట్లో భాగంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉంగుటూరు నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశం ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. జగన్ తీసుకొచ్చిన కొచ్చిన సమాంతర ప్రభుత్వాన్ని న్యాయపరంగా, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎదుర్కొంటాం.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డేటా ప్రొటెక్షన్ యాక్ట్ – 2022 ప్రకారం వ్యక్తిగత సమాచారం అనవసరంగా ఎవరు తీసుకున్నా దానికి బాధ్యత వహించాల్సిందే. మన వ్యక్తిగత సమాచారాన్ని దేవుడు అడిగినా ఇవ్వాల్సిన పనిలేదు. అలాంటిది జగన్ తన కోసం పెట్టుకున్న వాలంటీర్లకు ఎందుకు ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నేను మహిళల అదృశ్యం మీద మాట్లాడితే ఇప్పుడు దీనిపై చర్చ మొదలైంది.
అదృశ్యం అయిన మహిళలు రికవరీ శాతం రాష్ట్రంలో చాలా బాగుందని కొందరు చెబుతున్నారు. వెనక్కు వస్తున్న మహిళలు ఎలా అదృశ్యమయ్యారు.ఆదృశ్యమైన తర్వాత వారు పడిన బాధలు ఏమిటి..? వారి అదృశ్యం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి, దారుణమైన పరిస్థితుల్లో అదృశ్యమైన మహిళలు మళ్లీ వెనక్కి వస్తున్నారు. హైదరాబాదులో నా స్నేహితుడి కుమార్తె ఒకరు అదృశ్యమైతే వెంటనే నాకు ఫోన్ చేశాడు.
నేను తెలిసిన పోలీసు మిత్రులతో మాట్లాడితే వారు చెప్పింది ఏమిటి అంటే 24 గంటల్లో యువతి ఆచూకీ తెలిస్తే తెలిసినట్లు లేకుంటే 50 శాతం హోప్స్ లేనట్లేనని, 48 గంటలు దాటితే కచ్చితంగా యువతి ఆచూకీ లభ్యం కాకపోవచ్చు అని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. పెద్ద స్థాయి వ్యక్తులు కావడంతో నానా బాధలు పడి యువతి ఆచూకీని ముంబైలోని కామాటిపుర ఏరియాలో కనుక్కున్నారు.
అక్కడి పోలీసుల సహాయంతో యువతిని రక్షించగలిగారు. మరి పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని యువతులు, మహిళలు అదృశ్యం! అయితే ఎవరికి చెప్పుకోవాలి..? మన బాధల్ని ఎవరు పట్టించుకుంటారు..? అదృశ్యం అయిన తర్వాత వెనుకకు వస్తున్న యువతులు, మహిళలు వేదన ఈ ప్రభుత్వం వింటుందా..? అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామాల్లో వాలంటీర్లు చెప్పినట్లు అతని పరిధిలో ఉన్న 50 కుటుంబాలూ ఖచ్చితంగా వినాల్సిందే. అతను చెప్పినట్లు నడుచుకోవాల్సిందే.
ఏ సమాచారం అయినా నిమిషాల్లో తీసుకురావాల్సిందే. 50 కుటుంబాలకు ఒక జగన్ అన్నట్లు వారు తయారయ్యారు. బ్యాంకు ఎకౌంట్లు, పాన్ కార్డుల వివరాలు అన్నీ వారి వద్దనే ఉంటున్నాయి. వాలంటీర్లు చెబుతున్న ప్రకారం సమాచారం అంతా ఫోన్లో నిక్షిప్తం అవుతుంది అని అంటున్నారు.అసలు మీ ఫోన్ పోతే పరిస్థితి ఏంటి లేదా మీ ఫోన్ హ్యాక్ అయితే ఆ సమాచారం పరిస్థితి ఏమైనట్లు..?
ఏ సర్వర్ లో సమాచారం ఉంచుతున్నారు..? ఆ సర్వర్ అసాంఘిక శక్తులకు చిక్కితె పరిస్థితి ఏంటి? ఇలా ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. అసలు ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని అడగడానికి మీరు ఎవరు..? మీ పరిధిలో ఉన్న 50 కుటుంబాల్లో ఏం జరిగినా మీకు చెప్పాలని ప్రత్యేకంగా రూల్ ఎందుకు? ఈ సమాంతర వ్యవస్థ ఇప్పుడిప్పుడే వేళ్ళునుకొని బలోపేతం అవుతోంది. ఇది మరింత ముదిరితే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు అన్నారు.