కర్నాటక సిఎం యడ్యూరప్ప ఆదివారం తనకి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ప్రకటించారు. కరోనా పాజిటివ్ నిర్థారణ అవగానే ఆయన్ని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ లోని మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. సిఎం యడ్యూరప్ప ని అబ్జర్వేషన్ లో ఉంచాం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని మణిపాల్ హాస్పిటల్ చైర్మన్ డా.సుదర్శన్ బల్లాల్ ప్రకటించారు.
ఇది ఇలా ఉండగా తనతో గత రెండువారాలుగా క్లోజ్ గా ఉన్న అధికారులు, పార్టీ నాయకులు అందరూ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, వారందరూ కూడా స్వీయ నిర్భంధంలో ఉండాలని యడ్యూరప్ప తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలియచేసారు.
యడ్యూరప్ప కూతురు కూడా కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయినట్టు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి, అలాగే యడ్యూరప్ప చిన్నకొడుకు BY విజయేంద్ర వారం రోజులు స్వీయనిర్భందంలోకి వెళుతునట్టు ప్రకటించారు.
Discussion about this post