పవన్ కళ్యాణ్ మొదటి సినిమా.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్స్ లో ఇతడే మన కళ్యాణ్ అని పడిన పేరు, రెండో చిత్రం గోకులంలో సీత టైటిల్స్ లో పవన్ కళ్యాణ్ అని వేసారు.
దానికి కారణమైన వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ లో సిద్ధహస్తుడైన కళ్యాణ్, తన మొదటి చిత్రంలో గుండెలపై బండరాళ్ళు పగల కొట్టించుకోవడం, చేతి వేళ్ళ పై నుండి కార్లు వెళ్లడం లాంటి విన్యాసాలు చేశారు. ఆ సినిమా డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గారు మొదట ఆ సీన్ లు తీయడానికి ఒప్పుకోలేదు. కానీ కళ్యాణ్ నేను చేస్తానని మొండిగా ఆ విన్యాసాలను విజయవంతంగా చేసి మొదటి చిత్రం లోనే ముందు ముందు మీరు చూడబోయేది అసాధారణ వ్యక్తిని అనే సంకేతాలు పంపించాడు. ఆ చిత్రం తర్వాత అదే విన్యాసాలను రవీంద్ర భారతి వేదికగా ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు.
ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి గారు కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘మా ఇలవేల్పు ఆంజనేయ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండటం వల్లనే కళ్యాణ్ బాబు మొదటి చిత్రం విజయవంతం అయింది. అందుకే పవనసుతుడు ఆంజనేయ స్వామి ఆశీస్సులు తనకి లభించాలని తన పేరుకు ముందు పవన్ చేర్చడం జరిగింది ఇకపై కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ అని పిలవాలి అని తెలిపారు. ఇప్పుడు అర్థం అయిందిగా.. కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ గా మార్చింది ఎవరో ?
ఆ విధంగా మెగా బ్రదర్స్ లో చిరంజీవి గారు తర్వాత అంతటి క్రేజ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా కళ్యాణ్ బాబు మారే ప్రక్రియ లో తన ప్రమేయం లేకుండానే తన పేరుకు ముందు పవన్ చేరింది.
పవన్ కళ్యాణ్, ఇపుడు ఈ పేరు యువతలో ఒక ప్రభంజనం. రాజకీయాల్లో ఒక కొత్తతరం.