Emmy Awards 2025: ఎమ్మీ అవార్డులతో సత్తా చాటిన అడాల్సెన్స్.. 15 ఏళ్ల నటుడికి ప్రతిష్ఠాత్మక అవార్డు
Emmy Awards 2025: టీవీ, ఓటీటీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 77వ ఎమ్మీ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లోని పీకాక్ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ‘ది పిట్’, ‘అడాల్సెన్స్’ వెబ్ సిరీస్‌లు అదరగొట్టాయి. ‘ది పిట్’ ఉత్తమ డ్రామా సిరీస్‌గా అవార్డు గెలుచుకోగా, ‘అడాల్సెన్స్’ లిమిటెడ్ సిరీస్ విభాగంలో పలు అవార్డులు సాధించి సత్తా చాటింది.
ఈ అవార్డుల వేడుకలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘అడాల్సెన్స్’ సిరీస్ ఐదు కేటగిరీల్లో పురస్కారాలు సాధించింది. ఇందులో కీలక పాత్ర పోషించిన 15 ఏళ్ల ఓవెన్ కూపర్, ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు గెలిచి చరిత్ర సృష్టించాడు. ఎమ్మీ అవార్డు అందుకున్న అత్యంత పిన్న వయస్కుల్లో ఓవెన్ ఒకడిగా నిలిచాడు. ఇది అతనికి మొదటి ఎమ్మీ అవార్డు కావడం విశేషం.
ప్రధాన అవార్డుల విజేతలు..
- ఉత్తమ డ్రామా సిరీస్: ‘ది పిట్’ ఈ విభాగంలో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
- ఉత్తమ నటుడు (డ్రామా సిరీస్): ‘ది పిట్’ సిరీస్‌లో అద్భుతమైన నటనకు నోహ్ వైల్ అవార్డు అందుకున్నారు.
- ఉత్తమ నటి (డ్రామా సిరీస్): బ్రిట్నీ లీ లోయర్ (సిరీస్: సెవెరెన్స్) ఈ అవార్డును గెలుచుకున్నారు.
- ఉత్తమ కామెడీ సిరీస్: ‘ది స్టూడియో’ ఈ అవార్డును గెలిచి కామెడీ విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటింది.
- ఉత్తమ నటుడు (లిమిటెడ్ సిరీస్): స్టీఫెన్ గ్రాహం (అడాల్సెన్స్).
- ఉత్తమ సహాయ నటి (లిమిటెడ్ సిరీస్): ఎరిన్ డోహెర్టీ (అడాల్సెన్స్).
- ఉత్తమ సహాయ నటుడు (లిమిటెడ్ సిరీస్): ఓవెన్ కూపర్ (అడాల్సెన్స్).
- ఉత్తమ స్క్రిప్ట్ రైటర్: ‘లాస్ట్ వీక్ టునైట్.. విత్ జాన్ ఆలివర్’ (సాటర్డే నైట్ లైవ్).
- ఉత్తమ దర్శకుడు: ఆడమ్ రాండాల్ (స్లో హార్సెస్).
- ఉత్తమ దర్శకుడు (లిమిటెడ్ సిరీస్): ఫిలిప్ బారంటిని (అడాల్సెన్స్).
- ఉత్తమ సహాయ నటుడు (కామెడీ): జెఫ్ హిల్లర్ (సమ్‌బడీ సమ్‌వేర్).
- ఉత్తమ సహాయ నటి (కామెడీ): హన్నా ఐన్‌బైండర్ (హ్యాక్స్).
- ఉత్తమ రియాలిటీ షో: ‘ది ట్రెయిటర్స్’.
