• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Nagarjuna 100th Film: నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’ బిగ్ అప్‌డేట్.. హీరోయిన్‌గా స్వీటీ!

Nagarjuna 100th Film: నాగార్జున 100వ చిత్రం 'లాటరీ కింగ్' బిగ్ అప్‌డేట్.. హీరోయిన్‌గా స్వీటీ!

Sandhya by Sandhya
October 17, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
Nagarjuna 100th Film: నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’ బిగ్ అప్‌డేట్.. హీరోయిన్‌గా స్వీటీ!
Spread the love

Nagarjuna 100th Film: నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’ బిగ్ అప్‌డేట్.. హీరోయిన్‌గా స్వీటీ!

 

Nagarjuna 100th Film: టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిని చేరుకోబోతున్నారు. ఇప్పటికే 99 చిత్రాల్లో నటించిన ఆయన, తన 100వ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు, సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఈ చిత్రం నాగార్జున కెరీర్‌లోనే ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలవనుంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ‘లాటరీ కింగ్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ తెరకెక్కించనున్న ఈ చిత్రం కథాంశంపై ఆసక్తికరమైన లీక్‌లు బయటకు వచ్చాయి. ఈ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగనుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. ఒక పాత్రలో సాధారణ వ్యక్తిగా, మరొక పాత్రలో కీలక రాజకీయ నాయకుడిగా ఆయన కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, కథను మలుపు తిప్పే ముఖ్యమంత్రి పాత్రలో మరో స్టార్ హీరో క్యామియో ఇవ్వనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ సినిమా హీరోయిన్ల ఎంపిక విషయంలో నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మొదట్లో సీనియర్ నటి టబు పేరు ప్రధానంగా వినిపించినా, ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. అయితే, చివరకు అనుష్క శెట్టి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారని ఇండస్ట్రీ టాక్.

నాగార్జున, అనుష్క శెట్టి కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ గతంలో ‘బాస్’, ‘డాన్’, ‘రగడ’, ‘ఢమరుకం’, ’సోగ్గాడే చిన్నినాయనా’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. వారి కెమిస్ట్రీకి మంచి గుర్తింపు రావడంతో, ఈ హిట్ జోడీని మళ్లీ నాగ్ 100వ చిత్రంలో చూడబోతున్నారనే వార్తతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. సోషల్ మీడియాలో సైతం “నాగార్జున – అనుష్క కాంబో అంటే హిట్ గ్యారంటీ” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, ద్విపాత్రాభినయం, రాజకీయ నేపథ్యం, అనుష్క జోడీ వంటి అంశాలతో ‘లాటరీ కింగ్’ సినిమాపై హైప్ భారీగా పెరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Spread the love
Tags: Anushka Shetty King 100Dual role NagarjunaNag Anushka Lottery KingNagarjuna 100th movie updateNagarjuna political filmR. Karthik Nag 100అనుష్క శెట్టి కింగ్ 100ఆర్. కార్తీక్ నాగ్ 100ద్విపాత్రాభినయం నాగార్జుననాగార్జున 100వ సినిమా అప్‌డేట్నాగార్జున రాజకీయ చిత్రంనాగ్ అనుష్క లాటరీ కింగ్
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.