• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Alia Bhatt: రాహా కోసం అలియా భట్ ప్రత్యేక బహుమతి: కూతురుకు నెలకు ఒక ఇమెయిల్!

Alia Bhatt: రాహా కోసం అలియా భట్ ప్రత్యేక బహుమతి: కూతురుకు నెలకు ఒక ఇమెయిల్!

Sandhya by Sandhya
October 3, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
Alia Bhatt: రాహా కోసం అలియా భట్ ప్రత్యేక బహుమతి: కూతురుకు నెలకు ఒక ఇమెయిల్!
Spread the love

Alia Bhatt: రాహా కోసం అలియా భట్ ప్రత్యేక బహుమతి: కూతురుకు నెలకు ఒక ఇమెయిల్!

 

 

Alia Bhatt: ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ తన కుమార్తె రాహాపై తనకున్న అపారమైన ప్రేమను, మాతృత్వాన్ని పంచుకోవడానికి ఎప్పుడూ వెనుకాడదు. తాజాగా ఆమె తన కూతురి కోసం చేస్తున్న ఓ ఆసక్తికరమైన పనిని వెల్లడించారు. ప్రతి నెల రాహాకు ఒక ప్రత్యేకమైన ఇమెయిల్ రాస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె ఇటీవల కాజోల్, ట్వింకిల్ ఖన్నా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘టూ మచ్’లో పంచుకున్నారు. ఈ కార్యక్రమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్‌కి అలియా, వరుణ్ ధావన్తో కలిసి హాజరయ్యారు.

కూతురికి ఇమెయిల్స్ రాసే ఆలోచన తన స్నేహితురాలి ద్వారా వచ్చిందని అలియా తెలిపారు. ఎవరో తమ బిడ్డ కోసం ప్రతిరోజు ఉత్తరాలు రాసేవారని, ఆ విషయం తనకెంతో నచ్చిందని చెప్పారు. అందుకే రాహా పుట్టినప్పటినుంచి ప్రతి నెలా ఆమె కోసం ఒక ఇమెయిల్ రాస్తున్నట్లు వివరించారు.

ఆ నెలలో తీసిన ఫోటోలు, రాహా చేసిన అల్లరి పనులు, ఇతర ప్రత్యేక క్షణాలను ఆ ఇమెయిల్‌లో రాసి భద్రపరుస్తున్నారట. అంతేకాకుండా, వాటికి సరిపోయే ఒక చిన్న కొటేషన్‌ను కూడా జతచేస్తున్నట్లు చెప్పారు. తన కూతురికి 18 ఏళ్లు నిండిన తర్వాత దీనిని ఒక సర్ప్రైజ్ బహుమతిగా ఇవ్వాలని అలియా యోచిస్తున్నారు. అయితే, రాహా అంతకంటే ముందే అడిగితే 14 ఏళ్లకే అయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలియా ఆలోచనను ట్వింకిల్, కాజోల్, వరుణ్ ధావన్‌లు ఎంతగానో అభినందించారు.

వ్యక్తిగత జీవితంలో మార్పుతో పాటు, అలియా తన కుమార్తె సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి రాహాకు సంబంధించిన ఫోటోలను తొలగించారు. రాహా గోప్యతకు భంగం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఫోటోగ్రాఫర్‌లు, మీడియా తన ఈ అభిప్రాయాన్ని గౌరవించాలని కోరారు.

అలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్‌లో ఈ జంటకు రాహా జన్మించింది. తల్లి అయిన తర్వాత తన జీవితం ఎంతగా మారిందో అలియా సమయం దొరికినప్పుడల్లా పంచుకుంటూనే ఉన్నారు.


Spread the love
Tags: Alia Bhatt RahaAlia Bhatt's DaughterBollywood actress Alia BhattRaha EmailRanbir Kapoor Alia BhattToo Much Talk Showఅలియా భట్ కూతురుఅలియా భట్ రాహాటూ మచ్ టాక్ షోబాలీవుడ్ నటి అలియా భట్రణ్‌బీర్ కపూర్ అలియా భట్రాహా ఇమెయిల్
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.