Allu Arjun: ఇదెక్కడి మాస్ లైనప్ సామి.. అల్లు అర్జున్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ మెంటల్ అంతే
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్‌ను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన తదుపరి చిత్రం కోసం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో, అల్లు అర్జున్ ముంబై-హైదరాబాద్ మధ్య షటిల్ సర్వీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే అట్లీ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తారనే విషయంపై స్పష్టత లేనప్పటికీ, ఆయన లైనప్‌లో ఉన్న దర్శకుల పేర్లు వింటే అభిమానులకు మెంటల్ ఎక్కడం ఖాయం.
కొంతకాలం క్రితం దిల్ రాజు చొరవతో అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ మధ్య ఒక సమావేశం జరిగింది. అది కేవలం ఫార్మల్ మీటింగే అయినప్పటికీ, ప్రస్తుతం వీరిద్దరూ స్క్రిప్ట్ డిస్కషన్స్ దశలో ఉన్నారని సమాచారం. నీల్ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లు పూర్తి కాగానే, వీరి కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాపై పూర్తిగా దృష్టి సారించారు. ఆ ప్రాజెక్ట్‌కు మరో రెండేళ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన వెంటనే, అల్లు అర్జున్-రాజమౌళి కాంబోలో సినిమా రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అల్లు కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.
‘పుష్ప’ విడుదలైనప్పటి నుంచి అల్లు అర్జున్, బాలీవుడ్ లెజెండరీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో టచ్‌లోనే ఉన్నారు. వీరిద్దరూ గత ఏడాది నుంచే ఒక సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. అంతా అనుకూలిస్తే, వీరి విజువల్ వండర్ కాంబినేషన్ నుంచి ఒక సినిమాను ఆశించవచ్చు.
అల్లు అర్జున్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సరైనోడు’ సినిమాకు సీక్వెల్ చేసేందుకు బోయపాటి శ్రీను ఆసక్తి చూపిస్తున్నారు. ‘అఖండ’ తర్వాత ఆయన ‘సరైనోడు 2’ స్క్రిప్ట్‌పై కూర్చోబోతున్నారు. అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ మాస్ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
గతంలోనే అల్లు అర్జున్-కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక సినిమా అనౌన్స్ అయింది కానీ కొన్ని కారణాల వల్ల హోల్డ్‌లో పడింది. ‘పుష్ప 2’ తర్వాత కూడా కొరటాల శివ బన్నీకి ఒక కథ చెప్పగా, దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేసుకోమని సూచించారని తెలుస్తోంది.
వీటిలో ఏ ఒక్క ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా ఫైనల్ కాకపోయినా, ఈ అగ్ర దర్శకుల జాబితా అల్లు అర్జున్ యొక్క గ్లోబల్ మార్కెట్ విలువను, ఆయన క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. అట్లీ సినిమా తర్వాత బన్నీ ఏ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తారో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
