Naveen Polishetty: నవీన్ పొలిశెట్టి సింగర్‌గా మారాడు! ‘అనగనగా ఒక రాజు’లో కామెడీతో పాటు పాట కూడా..
Naveen Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో నవీన్ పొలిశెట్టి, తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నవీన్, ఈసారి తన కొత్త సినిమా కోసం సింగర్‌గా అవతారం ఎత్తినట్లు తాజా సమాచారం.
ఈ వార్త సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు అందిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి పాడిన పాటను నవంబర్ మూడో వారంలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ‘మ్యాడ్’ చిత్ర దర్శకుడు కల్యాణ్ శంకర్ స్థానంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు మారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ, ఇటీవల విడుదల చేసిన ‘ప్రీ వెడ్డింగ్ వీడియో’ నెట్టింట వైరల్ అవుతోంది.
నవీన్ పొలిశెట్టి మార్క్ కామిక్ హ్యూమర్ స్పష్టంగా కనిపించిన ఈ వీడియోలో… రాజుగారి పెళ్లి విందులో గోల్డ్ ప్లేట్‌లు, గోల్డ్ స్వీట్‌లు అంటూ అతిథులు మాట్లాడుకోవడం, ఈ పెళ్లి మలబార్ గోల్డ్ వాళ్లదా అని ఒక వ్యక్తి అనుమానం వ్యక్తం చేయడం నవ్వు తెప్పిస్తుంది. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం గురించి ఫోన్‌లో మాట్లాడుతూ, “ముఖేష్ మామయ్యా.. ఈ ఏడాది అంతా మీ పెళ్లి… వచ్చే ఏడాదంతా రాజుగారి పెళ్లి” అంటూ చెప్పే డైలాగ్స్ సినిమా స్థాయిపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో నవీన్ పొలిశెట్టి లుంగీ, బనియన్, మెడలో రుమాలు ధరించి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. కామెడీతో పాటు మాస్ టచ్ కూడా సినిమాలో ఉండబోతుందని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినోదభరితమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ‘అనగనగా ఒక రాజు’ నవీన్ పొలిశెట్టి ఖాతాలో మరో జాతి రత్నం లాంటి విజయాన్ని నమోదు చేస్తుందని ప్రేక్షకులు బలంగా విశ్వసిస్తున్నారు.
