NBK 111: బాలయ్య అభిమానులకి షాక్.. ఘోర ప్రమాదంతో కీలక నిర్ణయం తీసుకున్న మూవీ టీమ్, ఏంటంటే?
NBK 111: నటసింహం నందమూరి బాలకృష్ణ ఎనర్జీ, స్టైల్‌కు వయసు అడ్డుకాదన్న విషయం ఆయన తాజా చిత్రాల విజయాలతో మరోసారి నిరూపితమైంది. అరవై ఏళ్లు దాటినా, బాలకృష్ణ ఉత్సాహం, యాక్షన్, మాస్ స్టైల్ ఏ మాత్రం తగ్గలేదు. వరుస బ్లాక్‌బస్టర్‌లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బాలయ్య, తనదైన మార్క్ యాక్షన్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ పరంపరలో, ఆయన-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సంచలన విజయం ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి-బాలయ్య కాంబోలో ఇది నాలుగో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘అఖండ 2’ హడావుడితో పాటు, బాలయ్య తదుపరి ప్రాజెక్ట్ ‘NBK 111’ వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘వీర సింహారెడ్డి’ తర్వాత మరోసారి దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ జతకట్టబోతున్నారు. వృద్ధి సినిమాస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా గురించి చిత్ర బృందం ఇటీవల ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. “ చరిత్ర యుద్ధభూమి దాని రాణిని స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. సామ్రాజ్యం ఆమె గంభీరమైన రాకను చూస్తోంది…” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో, ఈ మధ్యాహ్నం 12:01 గంటలకు హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటిస్తారని అంతా భావించారు.
అయితే చేవెళ్ల వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 24 మంది మృతి చెందడంతో, చిత్ర బృందం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ విషాద ఘటన కారణంగా, ముందుగా అనుకున్న హీరోయిన్ పోస్టర్ ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో బాలకృష్ణ ఒక శక్తివంతమైన చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రాణి పాత్రలో అగ్ర నటి నయనతార నటించనున్నారన్న వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ సెట్‌లు, కళ్లుచెదిరే యుద్ధ సన్నివేశాలు, మాస్ ఎమోషన్‌లతో కూడిన పవర్‌ఫుల్ కథాంశంతో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాతో బాలకృష్ణ మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
