Bhairavi Vaidya : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటి అయినటువంటి ” బైరవి వైద్య” మరణించారు. ఆమె సినిమా మరియు టీవీ రంగాలలో పనిచేశారు. ఆమె వయసు 67 సంవత్సరాలు. ఆమె క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయినట్టు తెలుస్తుంది. గత 45 ఏళ్లుగా ఆమె తన కెరీర్ ని కొనసాగించారు. భైరవి సీనియర్ మోస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.
అయితే సంవత్సరం నుండి బైరవి క్యాన్సర్ తో పోరాడి చివరికి తన తుది శ్వాసను విడిచారు. ఆమె ఈ మధ్యనే ‘నిమా డెంజోంగ్పా’ అనేక టీవీ షోలో కనిపించారు. మరోపక్క భైరవి మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి నీ వ్యక్త పరిచారు. ఆమె సహనటి అయినటువంటి సురభి దాస్ భైరవి గురించి మాట్లాడుతూ.. ఆమె మరణించడం చాలా బాధాకరం. ఆమెతో నేను ఉన్నటువంటి సమయాన్ని మర్చిపోలేను. సెట్స్ లో తను చాలా కలుపుగోలుతనంగా ప్రవర్తించేది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అన్నారు.
బైరవి వైద్య హిందీ మరియు గుజరాతి చిత్రాలలో చాలా ప్రసిద్ధమైన పాత్రల్లో నటించారు. హస్రతిన్ మరియు మహి సాగర్ వంటి షోలలో పనిచేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటించిన “తాల్” సినిమాతో ఆమె బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. సల్మాన్ ఖాన్ ” చోరీ చోరీ చుప్కే చుప్కే” లో కూడా ఆమె చాలా కీలక పాత్ర పోషించారు. ఆమె మరణం అటు గుజరాతి ప్రజలను ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా కలిచివేసింది. బైరవి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.