BJP Manifesto : తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య పోరు మామూలుగా లేదు. ఈ మూడు పార్టీలు కూడా ప్రచారంలో ఒక అడుగు కూడా తగ్గకుండా దూసుకు వెళ్తున్నాయి. అయితే బీజేపీకి మాత్రం తెలంగాణలో తాము ఎందుకో వెనుకబడిపోయామని అభిప్రాయం ఉంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ ను ఎదుర్కోవడం కొరకు “ దశ దిశ” పేరుతో బిజెపి కొత్త మేనిఫెస్టోను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ప్రజలను ఆకట్టుకోవడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. అన్ని వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి వ్యూహాత్మకంగా ముందడుగు వేసిందని చెప్పవచ్చు. అదే నేపద్యంలోనే” దశ దిశ” పేరుతో మ్యానిఫెస్టో రూపొందించి కొత్త అస్త్రాన్ని ప్రజల్లోకి వదలనుంది. అయితే గల్ఫ్ బాధితుల అంశాన్ని ప్రత్యేకంగా తీసుకున్నట్టు సమాచారం .గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ తెలంగాణ భవన్ లను నిర్మిస్తామని బిజెపి తమ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలుస్తుంది.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణ కమిషన్ వేయాలని కూడా తమ మేనిఫెస్టోలో బిజెపి పేర్కొంది అంట.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఎత్తివేయాలని ఆ రిజర్వేషన్లను ఎస్సీ ,ఎస్టీలకు అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారంట, దాంట్లో భాగంగానే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించడం, వారిపై బోనస్ వంటివి మేనిఫెస్టోలో బిజెపి చేర్చిందని సమాచారం..
బిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ధరణి పోర్టల్ పెద్ద స్కామ్ అని బిజెపి వెల్లడించింది. ఆస్థానంలోనే మీ భూమి పేరుతో యాప్ తీసుకురావాలని బిజెపి కొత్త విధమైన పంతాను ఎన్నుకుంది. ఉజ్వల లబ్ధిదారులకు సంవత్సరానికి ఉచితంగా నాలుగు సిలిండర్లు అందించాలని, మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు, ప్రైవేట్ యాజమాన్యాల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట, చర్యలు చేపట్టే విధంగా కొత్త మేనిఫెస్టోలో బీజేపీ చేర్చుతుంది.
ప్రజల ఆరోగ్యం మేరకు ప్రతి జిల్లాకు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని,ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 సంవత్సరాలు నిండిన వారికి రెండు లక్షలు, బీసీల సంక్షేమం కోసం ఐదేళ్ల కు లక్ష కోట్ల నిధులు , రోహిన్యాలు , అక్రమ వలసదారులను ఇక్కడ నుంచి తిరిగి పంపించేలా ఏర్పాటులు, కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు హామీని మేనిఫెస్టోలో పొందుపరిచారు.
పిఆర్సిపి రివ్యూ చేయడంతో పాటు, ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి పిఆర్సి ఇచ్చేలా హామీ ఇవ్వబోతున్నారు బీజేపీ. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలతో బిజెపి ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తుంది. కానీ విజయం ఎవరిని వారిస్తుందో ప్రజల చేతుల్లో దాగివుంది. ఫలితాలు వెళ్లడయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.