C.M. K.C.R : మమ్మల్ని ఓడగొడితే మాకు పోయేదేం లేదు రెస్ట్ తీసుకుంటాం..మాకు వచ్చేది పోయేది ఏమిలేదు నష్టపోయేది ప్రజలే.. నా వంతు అయిపోయింది.. ఇక చేయాల్సింది ప్రజలే: కేసీఆర్
తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో తెలియదని వ్యాఖ్యానించారు. అచ్చంపేట సభలో కేసీఆర్ మాట్లాడుతూ ‘‘పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవి. పాలమూరు ప్రజలు బొంబయికి వలస పోయినప్పుడు ఈ నేతలెవరైనా వచ్చారా? నా పోరాటంలో నిజాయతీ ఉంది కాబట్టే విజయం సాధించా.
పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కోసం నా వంతు పోరాటం అయిపోయింది.. ఇక చేయాల్సింది ప్రజలే’’ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనియాంశమైనాయి. ఆభ్యర్దులను ముందు ప్రకటించి ప్రచారంలో దూకుడు పెంచిన పార్టీ ఇప్పటి పరిణామాలను నిశితంగా గమనించి ఆచి, తూచి మాట్లడుతోంది. ఇటీవల జరిగిన మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసిఆర్ ఊహించిన స్థాయిలో జన సమీకరణ జరగకపోవడం , తన ప్రసంగం జరుగుతున్న సమయంలోను పెద్దగా జనాలు కనిపించకపోవడంతో కేసీఆర్ ప్రసంగం కూడా సాదాసీదాగా జరగడంతో అనుకున్న మేర సక్సెస్ కాలేదని కెసిఆర్ సభకు లక్షకు పైగా జన సమీకరణ చేపట్టి సత్తా చాటుకోవాలని భావించినా,
జనాలు అంతగా హాజరు కాకపోవడం వల్లనే కేసీఆర్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసివుంటారు. గజ్వేల్‌ను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతాను.గజ్వేల్ ప్రజల మధ్యనే నేను ఉంటాను. ప్రతి నెల ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గం కోసం కేటాయిస్తానని సభలో చెప్పడం పై కేసీఆర్ కి గజ్వేల్ మీద నమ్మకం ఉంటే కామారెడ్డి లో ఎందుకు పోటీ చేయడం ఎందుకని ప్రతి పక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. అంతే కాకుండ అనేక సర్వేలు, ఇంటిలిజన్స్ నివేదికలు సైతం ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేక పోవడం , ప్రభుత్వ వ్యతిరేకత ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు వెరసి గులాబి దళాన్ని అత్మ రక్షణలో పడేశాయి.
ఎది ఎమైనా ఈ సారి గెలుపు అంత సునాయాసం కాదని గ్రహించి గాంభీర్యాన్ని ప్రదర్శించక సకారాత్మక విమర్శలు చేస్తూ అసమ్మతిని చల్లార్చి సమ్యమనంతో వ్యవహరించి గతంలో చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా వారు గెలిచిన ఆభ్యర్దులతోనే అధికారం చేపడతామని ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ఉద్యమ నేపధ్యంలో కొంత సేంటిమెంట్ పనిచేసి గతంలో మంచి ఫలితాలు సాధించినా ఇప్పుడు
ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా జాతీయ స్దాయిలో కీలక పాత్ర పోషించే దిశగా ఎదగాలంటే సంస్కరణలు ఆత్మవిమర్శ,చేసుకోవాలి సమిష్టి నిర్ణయాలు తీసుకొని పార్టీ లో అందరికి సముచిత న్యాయం కల్పించాలి. ఎది ఎమైనా ఈ సారి గులాబి బాస్ కాస్తంత మెత్తబడ్డారన్నది తేట తెల్లమౌతున్న విషయం. అది జాతీయ రాజకీయాలపై అసక్తా? లేక వారసుడికి ముఖ్యమంత్రి పదవి అప్పగించే వ్యూహమా..? తేలాల్సింది. కాలం తెలివితో మెలగాల్సింది ఓటర్.