C.M Pawan Kalyan : కొన్ని సంవత్సరాల క్రితం బక్క పలుచగా ఉన్న వ్యక్తి సినీ రంగ ప్రవేశం చేశాడు. అతనిని చూసిన అందరూ ఇతను చిరంజీవి తమ్ముడా.. ! అంటూ పరిచయం చేసుకున్నారు. కానీ అతి కొద్ది కాలంలోనే తనకంటూ సొంత ఇమేజ్ నీ సృష్టించుకుని. ఆ దిశగా ఎంతో శ్రమించి, నటనలో చక్కటి ప్రావీణ్యాన్ని పొంది, అతి కొద్ది కాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ఈరోజు ఎందరో హృదయాలలో స్థానాన్ని సంపాదించుకున్నాడు “మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.”
అయితే సినిమా నటులను అలాగే రాజకీయ నాయకులను గౌరవించడం, ప్రేమించడం వేరు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అది మొత్తంగా ఇంకో లెవెల్ లో ఉంటుంది. చాలామంది పవన్ కళ్యాణ్ ని హీరోలాగా ప్రేమించడం, అభిమానించడమే కాదు.. వారు ఆయనను దేవుని లాగా ఆరాధిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా సినీ ఇండస్ట్రీలోనే ఎవరికి దక్కని అదృష్టం, అభిమానం, ఆరాధన పవన్ కళ్యాణ్ కి దక్కాయి. ప్రేక్షకులు ఆయనను దేవుణ్ణి చేసి గుండెల్లో గుడి గుడికట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ తో ఆగిపోకుండా ప్రజలకు మంచి చేయాలి, అక్రమాల నుండి వారిని కాపాడి, వారికి మెరుగైన స్థితిగతులను అందించాలని ఆలోచనతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన ప్రజల మీద చూపించే నిస్వార్థ ప్రేమ మొన్నటి వారాహి యాత్ర ద్వారా బయటపడింది. ఎప్పుడు చెరగని చిరునవ్వుతో ఆయన ప్రజల్లో కలిసిపోతూ, సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కార దిశగా ఆలోచించారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటేనే అధికార ప్రభుత్వం వెన్నులో వణుకుతో పెండింగ్ లో ఉన్న పనులను కంప్లీట్ చేసింది అంటేనే.. పవన్ కు ఉన్న ఇమేజ్ ని మనం అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయాలు చాలా హీట్ ఎక్కాయి అని చెప్పొచ్చు. 2024 ఎన్నికల గాను పవన్ కళ్యాణ్ చాలా ఆచితూచి అడుగు వేస్తూ ప్రజల్లో కలిసిపోతున్నారు. ముఖ్యంగా ప్రజల ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకునే విధానం, వాళ్లతో మమేకమయ్యే విధానమే పవన్ నీ ప్రజల్లో నిలబెడుతుంది అనడానికి ఆస్కారం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయాన వైసిపి, జనసేన, టిడిపి మధ్యలో హోరాహోరీ పోరు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నప్పటికీ..
వచ్చే ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం జ్యోస్యం చెప్తుంది అంటున్నారు.. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పూర్తి రాజకీయాలలోనే కొనసాగడానికి ఆయన నటిస్తున్నటువంటి భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక 2024 ఎన్నికలకు కాను ఆయన కృషి వర్ణించలేనిది. అధికార వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను, అన్యాయాలతో ప్రజలు ఇప్పటికే విసుగెత్తిపోయారు తమకు కొత్త యువ నాయకుడు కావాలని ఆరాటపడుతున్నారు.
ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం పవన్ కళ్యాణ్ తన శాయా శక్తుల కృషి చేస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా సీఎం సింహాసనాన్ని అధిష్టిస్తాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క దీనిపైన విమర్శలు కూడా వస్తున్నాయి. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తి ఏకంగా సీఎం ఎలా అవుతాడు అంటూ కొంతమంది విమర్శిస్తున్నప్పటికీ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం..” తెరమీద బొమ్మలు రాజ్యమేలుతాయి” అని ఉంది. దానికి నిలువెత్తు నిదర్శనంగా పవన్ కళ్యాణ్ త్వరలో మనకు కనబడనున్నారు.