Chakora Pakshi : నీళ్లు తాగకుండా మనం జీవించలేం. ప్రతి జీవి మనుగడకు నీళ్లు చాలా ముఖ్యం. కానీ ఒక పక్షి మాత్రం సంవత్సరం కాలం పాటు నీళ్లు తాగకుండా బతికేయగలదు. ఆ తర్వాత ఒక్క నీటి బొట్టును కూడా ముట్టుకోదు. ఆ వింత పక్షి ఏమిటి.. దాని గురించి విశేషాలు తెలుసుకుందాం..భారతీయ సాహిత్యంలో ఈ పక్షి గురించి ప్రస్తావించబడింది.
ఇంతకీ ఆ పక్షి పేరు ఏమిటంటే.. జాకోబిన్ కోకిల అనగా చకోర పక్షి. ఈ పక్షి వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది. దీనిని పాపిహా అని కూడా పిలుస్తారు. చకోర పక్షి మొదటి వాన చుక్కను తాగుతుందని చెబుతారు. ఒకవేళ ఈ పక్షిని స్వచ్ఛమైన నీటి సరస్సులో ఉంచినా కూడా అందులో ఒక్క చుక్క నీటిని కూడా ముట్టుకోదు. ముక్కు మూసుకుని అలాగే ఉండిపోతుంది. ఈ పక్షిని రెండు రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి భారతదేశంలో చకోర పక్షి.
ఇది దక్షిణ ప్రాంతాలలో ఉంటుంది. ఇంకొకటేమో రుతుపవనాలతో అరేబియా సముద్రాన్ని దాటుకొని ఆఫ్రికా నుండి ఉత్తరం మరియు మధ్య భారతదేశం వైపు కనబడుతుంది. చకోర పక్షి యొక్క ఆహారం కీటకాలు మరియు పండ్లు. ఈ పక్షి శాస్త్రీయ నామం జాకోబినస్. ఈ పక్షి హిందీ నామదేయం క్లామిటర్. హిందీలో క్లామిటర్ అంటే అరవడం. అంటే చాలా స్వరంగల పక్షి అని అర్థం.
ఈ పక్షి గొల్లభామలు, బీటింల్స్ లాంటి వాటిని తింటుంది. అలాగే చెర్రీలు, పండ్లు ఈ పక్షి యొక్క ఆహారం. చకోర పక్షి ఋతుపవనాల రాకకు ముందు ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలోకి వలస వస్తుంది. అంటే రుతుపవనాలు రాబోతున్నాయని చకోర పక్షి చాలా ముందుగానే పసిగడుతుంది. అలాగే ఈ పక్షి ఇతర పక్షుల గూళ్ళల్లో గుడ్లు పెడుతుంది.