Chandrababu – Bail : గత 53 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. ఆయనకు బెయిల్ మంజూరు అవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. దాంతో వారు న్యాయం గెలిచింది. నిజాయితీ నిలబడింది. అంటూ హడావుడి స్టార్ట్ చేశారు. అయితే నిజంగా న్యాయం గెలిచిందా? చంద్రబాబు సచ్చీలుడు గా బయటికి వస్తున్నాడా..? అంటే లేదనే చెప్పాలి..
నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ వారు గానీ ఆ పార్టీ మీడియా గానీ “ఆయన నాకు బెయిల్ వద్దు .. నేను ఏ తప్పు చేయలేదు అందుకని నా కేసులు కొట్టేయాలి అని అడుగుతున్నారు అని డబ్బా కొట్టారు..” తీరా చూస్తే ఇప్పుడు అనారోగ్య కారణాలవల్ల బెయిల్ కావాలి అని కోరారు. ఆ కారణాలవల్లే ఇపుడు చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది. గానీ నిజానికి ఇప్పట్లో ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం లేదు. కేవలం ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకి బెయిల్ మంజూరు అయింది.
అది కూడా కేవలం 4 వారాలే మళ్లీ నవంబర్ 28న సాయంత్రం 5:00 లోపు ఆయన జైల్లో సరెండర్ కావాల్సిందే.. దీనికి కోర్టు చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఆయన మీద కేసులు కొట్టేసినట్టు న్యాయం గెలిచింది నిజాయితీ నిలబడింది అని తెలుగుదేశం పార్టీ చేసే హడావుడి చూస్తుంటే చూడ్డానికి చాలా కామెడీగా ఉంది..