Chandrababu’s Reaction on Telangana Congress Win : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీని వెనుక చంద్రబాబు నాయుడు హస్తము ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కి, చంద్రబాబు నాయుడుకి మంచి శిష్యుడు. రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడుకి మంచి అభిప్రాయం ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ని ఓడిపించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ కి మద్దతునిస్తూ అక్కడ టిడిపి పోటీ చేయలేదు. అనే వార్తలు వినిపించాయి.
అందరు కోరుకున్నట్టుగానే బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే దీని వెనకాల చాలా ప్లాన్సే జరిగినట్టు సమాచారం. ప్రధానంగా తెలంగాణలో కేసీఆర్ ని ఓడించి, అదేవిధంగా కేంద్రంలో మోడీ గ్రాఫ్ తగ్గిస్తే, కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వెళ్తే, 2024 లో కేంద్రంలో అధికారం దిశగా కాంగ్రెస్ కదులుతుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంచనా వేసినట్టు వేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గనక మంచి ఫలితాలు సాధిస్తే చంద్రబాబు కాంగ్రెస్ వైపు టర్న్ అవుతారని, అందుకే తెలంగాణలో తన పార్టీ కూడా పోటీకి పెట్టకుండా కాంగ్రెస్ కు సహాయ సహకారాలు అందించారని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఊహించిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించగా అందులో మూడు రాష్ట్రాలను బిజెపి కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో బాబు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
తను ఊహించింది జరగలేదు. తెలంగాణలో టీడీపీ పార్టీ పోటీకి నిలబడకుండా, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి భారీ ప్లాన్ వేసిన చంద్రబాబు సక్సెస్ ని సాధించారు. కానీ కేంద్రంలో రాష్ట్రాలు కైవసం చేసుకోకపోవడంతో ఆయన నిరాశ చెందారు. కాబట్టి ఆ విజయాన్ని చంద్రబాబు మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విజయంపై ఆయన స్పందించలేదు.