చిత్తూరు జిల్లా పలమనేరులోని ముసలిమడుగు వద్ద 22 ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. ఉదయం మంచు కురుస్తుండగా నడిరోడ్డుపై గజరాజులు హల్చల్ చేస్తుండగా గ్రామస్తులు మొబైల్ లో చిత్రీకరించారు. తమ గ్రామాల వైపు వస్తాయేమో అని అరుపులు అరవగా ఓ మదఫుటేనుగు గింకరిస్తూ గ్రామస్తులను వెంబడించడంతో పరుగులు తీశారు..
ఈ క్రమంలో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 30 నిమిషాల పాటు రోడ్డుపైనే అటు ఇటు తిరుగుతూ ఏనుగులు హల్చల్ చేశాయి. పలమనేరుకు వచ్చే వాహనదారులు సైతం అవి వెళ్లేంతవరకు వేచి చూశారు.
తమ గ్రామాల వైపు ఏనుగుల గుంపు వస్తే మా పిల్లలు మేము వృద్ధులు పరిస్థితి ఏంటి అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా కోరుచున్నారు.
