Daggubati Mohan Babu:విక్టరీ వెంకటేష్ ఇంట్లో తీవ్ర విషాదం… బాబాయ్ మోహన్ బాబు కన్నుమూత
సినీ హీరో విక్టరీ వెంకటేష్ ఇంట విషాదం నెలకొంది.వెంకటేష్ బాబాయ్, ప్రముఖ దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు (73) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తాజాగా ఆయన నివాసం అయిన బాపట్ల జిల్లా కారం చేడులో తుదిశ్వాస విడిచారు.విషయం తెలుసుకున్న వెంటనే వెంకటేష్ సోదరుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.. కొడుకుతో కలిసి కారం చేడు వెళ్లారు.
అయితే ఈ విషాద సమయంలో హీరో వెంకటేష్ ప్రస్తుతం అందుబాటులో లేరు.తన సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై లో ఉన్నందున రాలేకపోయినట్టు సమాచారం.ఈరోజు రాత్రి కానీ లేదా రేపు ఉదయం కారం చేడు కి వెంకటేష్ వెళ్లే అవకాశం ఉంది. అయితే మోహన్ బాబు మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.అలాగే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మోహన్ బాబు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.