Free Bus Travel for Women in Telangana : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తానని రేవంత్ రెడ్డి ముందుగానే చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆయన 6 గ్యారంటీలపైనే తొలి సంతకాన్ని కూడా చేశారు. ఆరు గ్యారెంటిలాల్లో సంబంధించినటువంటి ఒక గ్యారెంటీని డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఆరు గ్యారంటీలలో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకం గురించి వివరాలను తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం అంతట మహిళలు,ఆడ పిల్లలు, ట్రాన్స్ జెండర్లు రాష్ట్రమంతటా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని చేయవచ్చు.
ఈ ఉచితం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులకు వర్తించనుంది. ఈ బస్సులలో రాష్ట్రం మొత్తంలో మహిళలు ఎక్కడికైనా టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కాంగ్రెస్ చెప్పిన విధంగానే ఒక్కొక్క అమలను పూర్తి చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉచిత ప్రయాణం గురించి ప్రజలలో హర్షం వ్యక్తం అవుతుంది.