Gaddar with Pawan Kalyan : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రజా గాయకుడు గద్దర్ గారిని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్ గారు త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ గద్దర్ నీ ఎంతో ఆత్మీయంగా పలకరించారు. గద్దర్ కూడా పవన్ కళ్యాణ్ ని అంతే ఆత్మీయంగా ఆలింగణం చేసుకున్నారు.
ఈ సందర్భంలో వారు ఇరువురూ తెలుగు రాష్ట్రాలు, దేశ రాజకీయ పరిస్థితులపై కొంతసేపు ముచ్చటించుకున్నారు. రాజకీయం పద్మవ్యూహం వంటిదని అతి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా గద్దర్ అన్నారు. ప్రస్తుతం భారతదేశం యువతతో నిండి ఉందని, 60 శాతం మంది యువతే ఉన్నారని ఆయన అన్నారు.
యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని ఇప్పటివరకు వచ్చిన ఏ రాజకీయ పార్టీ కూడా ఆ సమస్యను నివృత్తి చేయలేకపోయారని గద్దర్ విచారాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత భారతదేశం రాజకీయ పరిస్థితులలో ఇటువంటి యువతకు నీ వంటి యువ నాయకుల నాయకత్వం ఎంతో అవసరమని వ్యాఖ్యానిస్తూ, విజయం నీదేనని ఒక అన్నగా ఆకాంక్షిస్తున్నట్లు గద్దర్ వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ కూడా గద్దర్ చెప్తున్నటువంటి రాజకీయ విశ్లేషణ గురించి ఎంతో ఆసక్తిగా విన్నారు. తనకు ఉన్నటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు తనను పరామర్శించినందుకు గద్దర్ గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.