ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకునేవారి వద్ద నుండి మద్యం సీజ్ చేస్తూ, పోలీసులు కేసులు పెట్టడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం సీసాలు తెచ్చుకోవడానికి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. ఇకపై ఆంధ్ర ప్రదేశ్ వెలుపల నుండి మూడు మద్యం సీసాలు తెచ్చుకోవచ్చు. రాష్ట్రంలో జీవో నెంబర్ 411 ని అమలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.