Housefull 5 OTT Release: OTTలోకి కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్‌టైనర్..
Housefull 5 OTT Release: బాలీవుడ్‌లో విజయవంతమైన కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘హౌస్‌ఫుల్’ సిరీస్ ఐదో భాగం, ‘హౌస్‌ఫుల్ 5’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. హాస్యం పంచుతూ, సినీ ప్రియులను అలరిస్తూ వచ్చిన ఈ చిత్రాల సిరీస్‌లో ఇది నాలుగో భాగాన్ని మించి, ఐదో భాగం రూపొందిన మొదటి బాలీవుడ్ ఫ్రాంచైజీగా నిలిచింది. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో..
ప్రస్తుతానికి, ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ. 349 అద్దె ప్రాతిపదికన చూడవచ్చు. దర్శకుడు తరుణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, సోనమ్ బాజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు.

హౌజ్‌ఫుల్ 5 కథ: చిత్ర కథాంశం బిలియనీర్ రంజీత్ చుట్టూ తిరుగుతుంది. తన 100వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవాలని భావించిన రంజీత్, తన కుమారుడు దేవ్, దత్తపుత్రుడు షిరాజ్, నమ్మకమైన బాడీగార్డ్, బోర్డు సభ్యులతో కలిసి ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ వేసుకుంటాడు. అయితే, ఈ ప్రయాణానికి ముందురోజు రాత్రి రంజీత్ ఆకస్మికంగా గుండెపోటుతో మరణిస్తాడు.
ఆస్తి పంపకాల విషయంలో విచిత్ర పరిస్థితులు
రంజీత్ మరణ వార్త బయటపడితే, అది స్టాక్ మార్కెట్‌పై, అతని కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని భయపడిన దేవ్, బోర్డు సభ్యులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకుంటారు. రంజీత్ ఆస్తిని పంచుకోవాలని ఆశించే కుమారులకు ఎలాంటి విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఆస్తి కోసం వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అనేది తెరపై చూడాల్సిన అసలు కథ. పూర్తి వినోదాన్ని పంచే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
