Hyderabad Polling : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న వేళా అందరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ నగర వాసులు మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ నగర వాసులు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. గత ఎన్నికల్లో కూడా అచ్చం ఇలాగే ఓటు వేయడానికి వాళ్ళు బయటికి రాలేదు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా హైదరాబాద్ లో ఓటింగ్ అత్యల్పంగా నమోదు అవుతుంది.
కేవలం 20 పోలింగ్ కేంద్రాల్లో 79 శాతం మాత్రమే కోటింగ్ శాతం చూపెడుతుంది. మరోవైపు చూస్తే సమయము మించిపోతూ ఉంది. ఇప్పటికి కూడా ప్రజల్లో కదలిక లేకపోవడంతో అధికారులు పెద్దవి విరుస్తున్నారు. నిజం చెప్పాలంటే తెలంగాణ ఎన్నికల్లో అందరూ దృష్టి రాజధానిపైనే ఉంటుంది. కానీ అక్కడ ప్రజలు మాత్రం ఓటును చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓటు విలువెంటో తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఇలా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఈరోజు సెలవు ఉండడంతో కొంతమంది ఇల్లు కదలడానికి ఇష్టం పడట్లేదు. మరి కొంతమందేమో సెలవు లేకపోయినప్పటికీ ఉదయాన్నే ఓటు వేసి తమ ఉద్యోగాలకి వెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ లో 24 నియోజకవర్గాల్లో సగటు పోలింగ్ శాతం వచ్చేసి 42%, నుండి 50% మాత్రమే నమోదు అవుతుంది. మరోవైపు ఓటు విలువ గురించి డిజిటల్ సమావేశాలు, అవగాహన సదస్సులు అన్ని నిర్వహించినప్పటికీ హైదరాబాద్ వాసులు మాత్రం తమకు నచ్చినట్టే బిహేవ్ చేస్తున్నారు.