International Yoga Day : యోగ ప్రతిరోజు చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉరుకుల,పరుగుల జీవితంలో మనము పనికి పెద్దపీట వేస్తాము. కానీ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోము. ప్రతిరోజు ఒక గంట సేపు యోగ చేయటం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండడమే కాక, ఆ రోజంతా చాలా ఉల్లాసంగా గడిచిపోతుంది. అయితే ఈ యోగాసనాల వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలు, కండరాలు : యోగాసనాలు ఎముకలకు, కండరాలకు తగినంత శక్తిని ఇస్తాయి. అలాగే ఆసనాలు వేయడం వల్ల కీళ్ల మధ్య ఉండే మెత్తని మృదులాస్థి సాగి, దగ్గరవుతూ ఉంటుంది. ఇలా జరగడం ఇంకా ఆసనాల్లో కూడా సాధ్యం కాదు. అలాగే ఈ ఆసనాల వల్ల కార్టిలేజ్కు పోషకాలు అందుతాయి. కీళ్లు అరిగిపోవడం అనే సమస్య రాకుండా ఉంటుంది.
నాడీ వ్యవస్థ : ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీర క్రియలన్ని అదుపులో ఉండడమే కాక, వేగంగా గుండె కొట్టుకోవడాన్ని, శ్వాసను నియంత్రిస్తుంది. చాలామంది రాత్రిళ్ళు నిద్ర సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి యోగా ప్రశాంతంతతను అందిస్తుంది.
వెన్ను : యోగాసనం వేయడం వల్ల వెన్నుపూస మధ్యలో ఉండే స్పైనల్ డిస్క్ లు దగ్గరగా, దూరంగా జరుగుతూ నాడులకు తగిన చేతనను అందిస్తుంది. యోగాసనాల్లో వెనుకకు ముందుకు మెల్లి తిరిగినట్లు వేసే భంగిమలు ఉంటాయి. వాటి వల్ల వెన్నుపూస ఫ్లెక్సిబిలిటీ మెరుగై శరీరం దృఢంగా ఉంటుంది.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత : మన రోజువారి జీవితంలో పనుల వల్ల చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాము. పని భారం పెరుగుతున్న కొద్ది ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది. అలాంటివారికి యోగ మంచి ఔషధంగా పని చేస్తుంది. యోగ చేయటం వల్ల పంచేంద్రియలు ప్రశాంతంగా ఉండి,జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
మధుమేహం : యోగ వల్ల మరొక ఉపయోగం మధుమేహ వ్యాధితో బాధపడే వారికి యోగ చెక్కర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. దాని ఫలితంగా కిడ్నీ సమస్యలు, గుండెపోటు సమస్యలు తలెత్తవు.
రోగనిరోధక శక్తి : యోగ వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. డిప్రెషన్, ఒత్తిడికి లోనవ్వడం లాంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే మానసిక రుగ్మతలు దరిచేరవు. క్యాన్సర్ లాంటి కణాలను నాశనం చేస్తుంది. క్యాన్సర్ కణాల నుండి విడుదలయ్యే వ్యర్ధాలను విసర్జించడంలో దోహదం చేస్తుంది.