Jagan – Chandrababu : ఒకప్పుడు తన మానాన తను బెంగుళూరులో సూట్ కేస్ కంపెనీలు పెట్టుకోని పత్తేపారం చేసుకునే జగన్ పేరుని పరిటాల హత్య కేసులో, అసెంబ్లీ లో ప్రస్తావించి రాజకీయల వైపు వచ్చేలా చేసాడు చంద్రబాబు.. ఆనాటి నుండి అంచెలంచెలుగా ఎదిగిన జగన్ ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక విధంగా జగన్ కి ఆనాడు చంద్రబాబు పరోక్ష మేలు చేసారు..
ఇప్పుడు చంద్ర బాబు 80 ఏళ్ల వయసులో పార్టీని నడిపిస్తూ, జగన్ దెబ్బకి కాకావికలమైన కమ్మ సామ్రాజ్యపు పెద్దలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి, పవన్ సాయంతో ఎలాగైనా 2024 లో గెలవాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మరోవైపు లోకేష్ పాదయాత్ర లో టీడీపీ ప్రకటిస్తున్న మేనిఫేస్టో, వైసీపి నవరత్నాల స్దాయిలో ప్రజల మైండ్ లో రిజిస్టర్ కానే లేదు. కేసుల భయంతో దూరంగా ఉంటున్న క్యాడర్ ని ఒక్క తాటిపైకి తీసుకోచ్చే విశ్వప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న టైమ్ లో చంద్రబాబు అరెస్ట్ ఆ పార్టీని ఒక్క సారిగా కుదిపేసింది.
నెక్స్ట్ ఏం చేయ్యాలో దిశా నిర్దేశిం చేసే నాయకులు ఒక్క సారిగా షాక్ కి గురై స్దబ్దుగా ఉండిపోయారు. ఈ వరుస పరిణామాలలో వైసీపి నేతల్లో ఉన్న పైశాచిక ఆనందం బయట పడింది. చంద్రబాబు నిఅరెస్ట్ చేయడం ద్వారా ఏదో ఘనవిజయం సాధించామని ఆనందపడ్డ వైసిపీ అగ్రనాయకత్వానికి షవరం అయితే గాని వివరం రాని చందాన రోజులు గడిచే కోద్ది ప్రజల మైండ్ లో వస్తున్న మార్పు చూసి ఇప్పుడు దిగాలు పడుతున్నారు.
బాబు అరెస్ట్ అనేది రాజకీయ ప్రేరేపిత కుట్రగానే ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. జగన్ చేసిన అతిపెద్ద చారిత్రక తప్పిదం ఇదేనని, పులివెందుల తరహా కక్ష పూరిత రాజకీయాలను ప్రత్యర్దులపై చూపిస్తున్న తీరు చూసి మేదావులు సైతం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకోంది. ఎన్నికల ప్రచారంలో బాబు గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపిస్తున్న వైసీపీ ని ఎలా ఎదుర్కోవాలో అనే సంశయంలో ఉన్న టీడీపి క్యాడర్ బిందాస్ గా కేక్ వాక్ చేసుకోని వెళ్లే సౌలభ్యం జగనే కల్పించాడు. బాబు నెత్తిన పాలు పోసాడు..