Jagananna Colony vs Janasena : ప్రజల సమస్యలను అందరి కళ్ళకు కట్టినట్లు చూపించడానికి జనసేన పార్టీ కొత్త పంథాను ఎంచుకుంది. జగన్ ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తుందో జనసేన పార్టీ బట్టబయలు చేయాలని దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తుంది. ఒకవైపు జగన్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇల్లు కట్టించి కాలనీలు నిర్మిస్తున్నామని చెప్పి ఆ పేరు మీద వేలకోట్లు దోచుకు తింటున్నారు. ఈ పరిస్థితిల దృష్ట్యా జనసేన పార్టీ వినూత్న ఆలోచనకు దారితీసింది.
జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ప్రజల ముందుంచే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ దిశగానే ప్రజలతో మేమున్నాము వారికి అన్యాయం జరగనీయము. జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను బట్టబయలు చేస్తాము. అభివృద్ధి చేస్తున్నాం అని చెబుతూ అభివృద్ధి పేరిట జగన్ ప్రభుత్వం కొన్ని వేల కోట్లను దోచుకుంటుంది. వాటి లెక్కలు అడుగుతే మాత్రం తప్పించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వాటన్నింటిని మేము ప్రజల ముందు ఉంచుతాము అని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా జగనన్న పేరిట ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ దుస్థితిని ప్రజల పరిస్థితిని మనం సమాజానికి తెలియచేయాలి అని పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధినేత ఇచ్చిన పిలుపుమేరకు ఆయా నియోజకవర్గంలోని జగనన్న కాలనీల దుస్థితిని కార్యకర్తలు ప్రజల ముందు ఉంచారు.
29 తేదీ ఉదయం 10గంటల నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేసేందుకు డిజిటల్ క్యాంపెయిన్ జనసేన పార్టీ కార్యకర్తలు చేపట్టారు. ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం, రాపాక గ్రామంలో జగనన్న కాలనీ దుస్థితిని ఆ నియోజకవర్గం లోని జనసేన కార్యకర్తలు బట్టబయలు చేయగా, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి
నియోజకవర్గం, శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ నందు జగనన్న కాలనీ దుస్థితిని ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలు బహిర్గతం చేశారు. టెక్కలి నియోజకవర్గం, జగతి మెట్ట వద్ద జగనన్న కాలనీ దుస్థితినీ జనసేన కార్యకర్తలు ప్రజానీకం ముందు పెట్టారు. ఉమ్మడి కడప జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం, బుడుగుంటపల్లి గ్రామంలో జగనన్న కాలనీ దుస్థితినీ వివరిస్తూ.. ఈ మండల పరిధిలో 1676 ఇండ్లు మంజూరు కాగా 250 మాత్రమే ఒక మోస్తరు పనులు జరిగినవి అని వారు వెల్లడించారు.