JanaSena Chief Pawan Kalyan : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలిపారు. మనిషి ప్రాణాలను కాపాడే ఏవరైన దైవం తో సమానం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నర్సులు కూడా ఆ కోవలోకే వస్తారు అని, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆ సందర్భంగా ఆయన డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఇతర వైద్య సహాయకులందకి కూడా ఈ కోవలోకే వస్తారు అని వారి సేవలను కోనియడారు. 24 గంటలు ప్రజల కోసం అహర్నిశలు శ్రమించి నిద్రాహారాలు మానీ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన వారికోసం పనిచేస్తుంటారు.
ఈ వృత్తికి సంబంధించి మనం తలుచుకునే ముఖ్యమైన వ్యక్తులలో నైటింగేల్ చిరస్మరణీయురాలు. నర్సింగ్ లో శుభ్రత, సమయానికి మందులు అందించడం, రోగిని కంటికి రెప్పలా కాపాడుకోవడం నైటింగేల్ ద్వారానే ప్రపంచ వ్యాపితమైంది. ఆమె సేవలకు గుర్తింపుగా ఆమె జన్మదినమైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ఈ సందర్భంగా నర్సింగ్ వృత్తిలో ఉన్న సిస్టర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. వైద్య ఆరోగ్య సేవల్లో నిమగ్నమయ్యే ప్రతి నర్సునీ పవిత్ర భావంతో గౌరవించాలి. ఎంతగానంటే మన తల్లిని, సోదరిని ఎంతగా గౌరవిస్తామో, ఎంత పవిత్రంగా చూస్తామో అంతగా గౌరవించాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
కోవిడ్ విపత్కాలంలో మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా నర్సులు అందించిన సేవలు ఎంతో అమూల్యమైనవి. ప్రాణాలకు తెగించి రక్షణ వస్త్రాలు ధరించి రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉండిపోయి వారు అందించిన సేవలను ఈ దేశం ఎన్నటికీ మరచిపోదు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.
మనసారా వారు చల్లగా ఉండాలని కోరుకోవడం తప్ప. ఈ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆర్ధికంగా, సామాజికంగా సుస్థిర స్థానంలో ఉండాలని నా పక్షాన, జనసేన పక్షాన కోరుకుంటున్నాను. కష్టతరమైన ఈ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కలుగచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని నర్సుల సేవలను కొనియాడారు.