Janasena Chief Pawan Kalyan : అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను పరామర్శించడానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రమానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కి ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రమంలో స్వాగతం పలికారు.
రైతులను పరామర్శించే విషయం గురించి పవన్ కళ్యాణ్ మూడు రోజుల క్రితమే చెప్పారు. అకాల వర్షాలకి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లోని ఆవ భూముల్లో వ్యవసాయం దెబ్బతిని, అక్కడి రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ఈ విషయమై రైతులను ఓదార్చి, భరోసా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారిని కలవనున్నారు.
అక్కడి వ్యవసాయ భూములను పరిశీలించి రైతుల కష్ట, నష్టాలను ఆయన తెలుసుకుంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడ చేరుకుని పంట నష్టపోయిన రైతులతో మాట్లాడుతారు. ఆ తర్వాత
పి.గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం వెళ్లి అక్కడ రైతులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులు పాల్గొననున్నారు.