Janasena Chief Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి రైతుల పరామర్శ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలు తిరుగుతూ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యారు. రైతుల పరామర్శ తర్వాత రాజమండ్రి చేరుకున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గత ఎన్నికలకు ముందు రైతులకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఆ నిర్ణయాన్ని కార్యాచరణలో పెడుతూ, ఈరోజు రాజమండ్రిలో జనసేన పార్టీ కార్యాలయానికీ ప్రారంభోత్సవం చేశారు. తర్వాత పార్టీ కార్యాలయంలో మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాములో తూర్పుగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల జనసేన ఇన్చార్జ్ లు పాల్గొన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో, పార్టీ ఏ విధంగా పని చేయాలి ,తీసుకోవాల్సిన కార్యచరణ ఏంటి, అనే విషయాల పైన ఇన్చార్జిలకు పవన్ కళ్యాణ్ గారు దిశా,నిర్దేశమ్ చేసారు. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి లతోపాటు పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
తమకు అందుబాటులో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంతో, తూర్పుగోదావరి జిల్లా ప్రజలు, రాజమండ్రి ప్రజలు, తమ కష్టాలను అర్థం చేసుకునే నాయకుడు, తమకు అండగా ఉండే నాయకుడు, ఇప్పుడు ఇంకా దగ్గరగా అందుబాటులో ఉంటారని పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.