Janasena in Australia : ఆస్ట్రేలియా జనసేన సమన్వయ పార్టీ కార్యకర్తలుగా నియమించిన కొలికొండ శశిధర్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఆస్ట్రేలియా జనసేన సమన్వయకర్తలుగా ఈ మధ్యకాలంలో కొలికొండ శశిధర్ ని నియమించిన విషయం మనకు విదితమే. వారు ఆస్ట్రేలియా నుండి కోటి రూపాయల విరాళాన్ని పార్టీ కోసం కూడా అందజేశారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారిని కలిసిన శశిధర్ ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా జనసైనికులను సమన్వయపరిచి పార్టీ కార్యక్రమాలకు సహాయపడేలా ప్రోగ్రామ్స్ చేయనున్నామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పార్టీని స్థాపించి ఎంతో పాటుపడుతున్నారని, ప్రజా సమస్యలపైననే ఆయన దృష్టి మొత్తం నెలకొందని, ప్రజా సమస్యల గురించి పట్టించుకునే పవన్ కళ్యాణ్ అంటే మాకు ఎనలేని ప్రీతి, అభిమానం,
గౌరవం అని, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు పనిచేసే తీరును చూసి మేము స్ఫూర్తిపొందాము, ఆయనలాగే మేము కూడా పని చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరామని, పార్టీ కోసం మేము ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని శశిధర్ వెల్లడించారు . పవన్ కళ్యాణ్ గారి ఉన్నతమైన ఆలోచన దృక్పథం, ఉన్నతమైన విలువలను చూసి మేము కూడా మా వంతుగా పనిచేయాలని నిర్ణయించుకొని, ఒక కోర్ కమిటీగా ఏర్పడి గత
తొమ్మిది సంవత్సరాలుగా పార్టీ కోసం పార్టీ తరఫున మేము పనిచేస్తున్నాము. పార్టీని కాపాడుకుంటాం, పార్టీ కోసం మాకు చేతనైన సహాయం చేస్తాము. ప్రజల్లో ఉండే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, ఆశయం చాలా గొప్పది. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల గురించి ఆలోచించే విధానం ఇప్పుడు ఏ పార్టీ నాయకులు కూడా ఆలోచించలేరు. ఆయన భవిష్యత్ తరాల కోసం పాటుపడుతున్నారు.
భవిష్యత్తరాల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారు. భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు వెళ్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం పనిచేయడం మాకెంతో సంతోషంగా ఉంది. అని పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భంగా కొలికొండ శశిధర్ తెలిపారు.