Janasena : వైసీపీ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ మీద, నాయకులు,కార్యకర్తల మీద ఫ్లెక్సీలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ, విషం చిమ్ముతున్నారు. వైసీపీ తీరుపై జనసేనా పెద్ద ఎత్తున నిరసనలు, వ్యతిరేకత ప్రదర్శించింది. వైసిపి ఏర్పాటు చేసిన బ్యానర్లను తక్షణమే తొలగించాలని అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి, అక్రమ కేసులు కొట్టి వేయాలని
జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు, నాయకులు,కార్యకర్తలు అనకాపల్లిలో మరియు మార్కాపురం నియోజకవర్గం లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఎస్సై కి మెమొరండం ఇచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా అనకాపల్లి లో ఏర్పాటు చేసిన పోస్టర్స్ తక్షణమే తొలగించాలని అనకాపల్లి GVMC కమిషనర్ ను నిన్న కలిసి చెప్పినప్పటికి తొలగించకపోవడంతో GVMC మెయిన్ గేటుకు
సీఎం జగన్ రెడ్డి కి వ్యతిరేకంగా ఫ్లెక్సీ వేసి ధర్నా చేసారు జనసేన నాయకులు. ఈ నేపథ్యంలో జనసేన అనకాపల్లి నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం జనసేన కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అధికార వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు తొలగించకుండా ఉంచుతూ.. కావాలనే జనసేన పార్టీ నాయకులు వేసినటువంటి బ్యానర్లు కేవలం రెండు గంటల
వ్యవధిలోనే అధికారులు తొలగించడం, దుర్మార్గమైన చర్య అని జనసేన నాయకులు పోలీసులపై మండి పడ్డారు. CM జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ప్రజల మధ్య ,ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతోనే ఇష్టానుసారం బ్యానర్లు వేస్తున్నారు. వైయస్సార్సీపి బ్యానర్లు పక్కనే జనసేన బ్యానర్లు ఉంచండి.
మా బ్యానర్లు తొలగించే సమయంలో మమ్మల్ని పిలవండి అప్పుడు ఏం జరుగుతుందో చూడండి అని పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పదే,పదే మేము ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగిస్తే ఈసారి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అని జనసేన కార్యకర్తలు హెచ్చరించారు.