Janasena : ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేకెత్తిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక అక్రమ అరెస్టును ఖండిస్తూ ఒక నిరసన వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్టుపై ప్రజల నుండి ప్రతిపక్ష జనసేన పార్టీ నుండి కూడా నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అంటూ చాలామంది గలమెత్తారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వాలని ఆలోచన తలపెట్టారు. ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం (11-09-2023) తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించింది. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోంది.
ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోంది వైసీపీ ప్రభుత్వం. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తుంది. రేపు జరగబోయే బంద్ లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.