Janasena : క్యాంపెయిన్ పోస్టర్లను తెనాలిలో విడుదల చేసిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే. ప్రజల ఆలోచన విధానానికి ప్రతిబింబం ఓటు, చట్టసభల్లోకి తమ తరఫున ఎవరిని పంపించాలి అని నిర్ణయం ఓటు పైనే ఆధారపడి ఉంటుంది. ఈసారి రాష్ట్రంలో యువత వేసే ఓటు కీలకం. వారి నిర్ణయమే వచ్చే ఎన్నికల్లో శిరోధార్యం.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లక్షల మంది యువత కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు. వారంతా మొదటి ఓటును తమ భవిష్యత్తును బంగారుమయం చేసే జనసేన పార్టీకి వేస్తారని ఆశిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో మొదటి ఓటును వినియోగించుకోనున్న యువతలో చైతన్యం నింపేలా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్త క్యాంపెయిన్ ను నేటి నుంచి మొదలుపెట్టనుంది. “My First Vote for JANASENA” పేరుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ చైతన్య కార్యక్రమాన్ని నిరంతరాయంగా యువతలోకి తీసుకువెళ్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు.
తెనాలి నియోజకవర్గంలో గురువారం My First Vote for JANASENA క్యాంపైన్ పోస్టర్లను కళాశాల విద్యార్థులతో కలిసి శ్రీ మనోహర్ గారు ఆవిష్కరించారు. విద్యార్థులతో మాట్లాడి మీ మిత్రులు ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని, మొదటి ఓటును జనసేన పార్టీకి వేసి మీ బలమైన సహకారం అందించాలని కోరారు. భవిష్యత్తు తరాల గురించి ఎంతో ఉన్నతమైన ఆలోచన చేసే పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలు యువతకు ఎంతో స్ఫూర్తి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను అందిపుచ్చుకునే యువతరం రాష్ట్రంలో ఉన్నారు.
వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా, ఒక ఉన్నతమైన దారిని ఏర్పాటు చేసే పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఆలోచిస్తారు. అలాంటి నాయకుడికి అండగా నిలిచేలా వచ్చే ఎన్నికల్లో మొదటి ఓటు వేయనున్న యువత జనసేన పార్టీకి అండగా నిలబడాలి. వారి మద్దతు జనసేన పార్టీకి మరింత బలం తీసుకొస్తుంది. నేటి యువతరం ఉన్నతమైన ఆలోచన చేసి జనసేన పార్టీకి అండగా నిలబడాలి. మొదటి ఓటును జనసేన పార్టీకి వేసి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలవండి. ఈ చైతన్య కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ బలంగా తీసుకుని వెళ్తాం. యువతను దీనిలో భాగస్వామ్యం చేస్తాం అన్నారు.