Janasena Veeramahilalu : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ వీర మహిళలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వాసిరెడ్డి పద్మ విసిరిన సవాలును స్వీకరించిన గుంటూరు జిల్లా వీర మహిళలు చర్చకు రావాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
వాసిరెడ్డి పద్మతో చర్చకు అయినా సిద్ధం, చంపలు పగులగొట్టుకోవడానికైనా సిద్ధం అంటూ నినాదాలు చేశారు. అప్పటికే మహిళా కమిషన్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వీర మహిళలను అరెస్టు చేశారు. పోలీసులు వీర మహిళల తో చాలా అనుచితంగా ప్రవర్తించారు. అరెస్టు చేసిన వారిని స్టేషన్ కు తరలించకుండా వారి ఇష్టా రాజ్యాంగ వ్యవహరించారు.
తాము న్యాయంగానే నిరసన చేస్తున్నామని వీర మహిళలు చెబుతున్నప్పటికీ, పోలీసులు తమ జులుం చూపించారు. మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. పోలీసు వాహనాల్లో గంటల తరబడి రోడ్లు తిప్పుతూ.. అరెస్టు చేసిన వారందరిని ఒకే చోట ఉంచకుండా వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒక్కొక్కరిని ఒక్కో స్టేషన్ కి తరలిస్తూ వీర మహిళలను ఇబ్బందులకు గురి చేశారు. 25 మందిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఆరుగురిని తాడికొండ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. మరో 40 మందిని తెనాలి వైపు తీసుకువెళ్లారు. నిరసన కార్యక్రమంలో పార్టీ ప్రాంతీయ వీర మహిళా విభాగం సభ్యులు శ్రీమతి బొని పార్వతినాయుడు, శ్రీమతి రావి సౌజన్య, గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు శ్రీమతి బిట్రగుంట మల్లిక, శ్రీమతి బడే కోమలి, శ్రీమతి తులసి కుమారి తదితరులు పాల్గొన్నారు.