Janasena vs Jogi Ramesh : ధర్మవరంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మంగళవారం తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్ కు పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి లేదన్నారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు రాష్ట్రగృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ఒక బ్రోకర్, జోకర్ అంటూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేశ్ సోమవారం రోజున తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు ఆర్5జోన్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జోగి రమేశ్ మాట్లాడుతూ..
పవన్ కల్యాణ్ ఓ పిచ్చికుక్క… పెళ్లాలను మార్చినంత ఈజీగానే పార్టీలు కూడా మారుస్తాడంటూ జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేసారు. పవన్ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. జనసేన పార్టీ నేతలు మండిపడ్డారు. ఎక్కడికక్కడ ప్రెస్మీట్ లు, నిరసనలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్, జోగి రమేష్ తీరుపై ధ్వజమెత్తారు.
ఈ నేపద్యంలో విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పిచ్చి కుక్క జోగి రమేష్ అంటూ నినాదాలు చేస్తూ.. డౌన్, డౌన్ జోగి రమేశ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి, రోడ్డుపైనే మంత్రి దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
జనసేన నేతలు వైయస్ జగన్ పై తీరుపై మండి పడ్డారు. ఒక నిండు సభలో పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ ఒక పిచ్చి కుక్కలాగా ప్రవర్తిస్తుంటే.. అడ్డుకోవలసిన ముఖ్యమంత్రి చూస్తూ , ముసి ముసి నవ్వులు నవ్వతూ అలా ఊరుకోవడం ఎంతవరకు సమంజసం. ఈ విషయంపై వైయస్ జగన్ సమర్థించుకోవడం ఇంకా సిగ్గుచేటని జనసేన నేతలు జగన్ పై విరుచుకుపడ్డారు.