Janasena vs YCP : జగన్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తామని కుంటి సాకులు చెబుతూ 89 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రకటించింది. కానీ ఎక్కడా కూడా సామాన్య ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు కూడా అందడం లేదు. వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. పేద ప్రజల పేరు చెప్పుకొని వాళ్ళ పొట్ట కొడుతూ ఈ జగన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు.
వాటిని బయటపెట్టే దిశగానే జనసేన ప్రభుత్వం ముందుకు కదులుతుంది. దాంట్లో భాగంగానే సామాజిక మాధ్యమాల ద్వారా జగన్ ప్రభుత్వం యొక్క అరాచకాలను, అవినీతిని బయట పెడతామంటూ జనసేన పార్టీ ప్రకటన వెల్లడించింది. మౌలిక వసతుల కల్పన పేరిట రూ. 89 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు జగన్ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఆ కోట్లు ఎటు పోతున్నాయి.
ప్రతి జగనన్న కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తామని రకరకాల కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూనే ఉంది. మౌలిక వసతుల పేరిట చేసిన మోసాన్ని ప్రజలకు తెలియచేద్దాం. రోడ్ల నిర్మాణం కూడా స్థానిక ఎమ్మెల్యేల అనుచరులకే పరిమితం అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారుల నుంచి రోడ్ల నిర్మాణం పేరిట డబ్బులు వసూలు చేసి ఇబ్బందులు పెట్టడం..
వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు నిరసన తెలిపితే పట్టాలు రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడి మరీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శనివారం పార్టీ శ్రేణులంతా కలసి జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ వాస్తవ పరిస్థితులు ఫోటోల రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియచేయండి. ఒక వానకే పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు మునిగిపోయాయి.
వైసీపీ చేసిన అతిపెద్ద స్కామ్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లాం, జగనన్న కాలనీల పేరిట ఇచ్చిన పట్టాల ప్రహసనం ఒక ఎత్తయితే.. తరవాత ప్రజల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారన్న విషయాన్ని లబ్ధిదారులు చాలా సందర్భాల్లో పార్టీ దృష్టికి తీసుకు వచ్చారు. పార్టీ నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు జగనన్న కాలనీల్లో పర్యటించి ప్రజలకు వాస్తవాలు తెలుపుదాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అని నాదెండ్ల వెల్లడించారు.