రాష్ట్ర శెట్టిబలిజ గౌడ సంఘం మాజీ కార్యదర్శి జుత్తుగ నాగరాజు నేడు నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. నాగరాజు గతంలో ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్చార్జి చైర్మన్ గా మహాదేవపట్నం గ్రామ ఉపసర్పంచ్ గా టిడిపి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. వ్యవసాయంలో వచ్చిన నష్టాలు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇస్తున్న విధానం నన్ను ఆకర్షించింది. జనసేన పార్టీ ప్రజల పక్షాన చేస్తున్న కార్యక్రమాలు చూసి జనసేనలో జాయిన్ అయినట్టు ఆయన తెలిపారు.
