Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘డ్రాగన్’ షూటింగ్ రీస్టార్ట్.. యూరప్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్
Dragon: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ గురించి శుభవార్త అందింది. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ నవంబర్ మూడో వారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఇటీవల యాడ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గాయపడటంతో, వైద్యుల సూచన మేరకు మూడు నెలల విశ్రాంతి కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
‘డ్రాగన్’ యూనిట్ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. మళ్లీ ఫిట్‌గా, ఎంతో ఉత్సాహంగా షూటింగ్‌కు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ‘వార్ 2’ తర్వాత అభిమానులను సంతృప్తిపరచలేని ఎన్టీఆర్, ఈసారి ‘డ్రాగన్’తో తప్పకుండా సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా ‘డ్రాగన్’ స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మధ్య క్రియేటివ్ విభేదాలు తలెత్తాయని, స్క్రిప్ట్‌లో పెద్ద మార్పులు జరుగుతున్నాయని టాలీవుడ్‌లో ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ రూమర్స్‌ను కొట్టిపారేస్తూ, స్క్రిప్ట్‌లో కొన్ని చిన్నపాటి మార్పులు మాత్రమే జరిగాయని, ప్రస్తుతం కథాంశంపై ఇద్దరి మధ్య స్పష్టత వచ్చిందని తాజా సమాచారం ధృవీకరిస్తోంది.
ఈసారి ‘డ్రాగన్’ షూటింగ్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ యూరప్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ విదేశీ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లుతో పాటు, హీరో-హీరోయిన్ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొంటారా లేదా అనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాను గతంలో ప్రకటించినట్టుగానే, 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు మరోసారి ధృవీకరించారు.
