Late Night Dinner : అర్ధరాత్రి ఆలస్యం చేయకుండా భోజనాన్ని త్వరగా ముగిస్తే ఆరోగ్యానికి మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో కాస్తో, కూస్తో అటు ఇటు అయినా పర్లేదు కానీ రాత్రి భోజనం మాత్రం 7 గంటలలోపే ముగించేయాలి. లేకపోతే ఆరోగ్యానికి చాలా హానికరం ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే కలిగే నష్టాలు..
★ భోజనానికి, నిద్రకు రెండు గంటల వ్యవధి లేకపోతే నిద్ర సంబంధిత వ్యాధులు మొదలవుతాయి.
★ లేట్ డిన్నర్ వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరు కొనిపోయి, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
★ అల్సర్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఆలస్యపు ఆహారం వల్ల వస్తాయి.
★ఆలస్యంగా తినడం వల్ల ఆహారం జీర్ణం కాకపోగా శరీరంలో జీవక్రియలు నెమ్మదిగా పనిచేస్తాయి.
ఈ సమస్యలను తప్పించుకోవాలంటే సరిగ్గా సమయానికి తినాలి. రాత్రి సమయంలో తీసుకునే ఆహారంలో అన్నం కంటే పండ్లు, జ్యూస్ లు, సలాడ్స్ ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచిది. మసాలాలు, కారం లాంటి ఘటున్న పదార్థాలు రాత్రి భోజనంలో లేకుండా చూసుకోవడం మంచిది.
ఆహారంతో పాటు వ్యాయామం కూడా ఒంటికి చాలా అవసరం. మద్యం, పొగ తాగడం లాంటి అలవాట్లు మానుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే పై జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ రాత్రి 7లోపే ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.