Lokesh Satire on Jagan : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ “వై ఏపీ నీడ్స్ జగన్” అనే కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ ఆలోచన. అయితే ఈ కార్యక్రమంపై నారా లోకేశ్ సెటైర్లు వేశారు. నిజంగానే ఏపీకి జగన్ ఎందుకు కావాలి..? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త దుమారం రేపుతుంది.
జగన్ నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఏపీకి జగన్ ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడం తప్పించి ఏపీకి జగన్ చేసింది ఏమీ లేదంటూ నారా లోకేష్ వెల్లడించారు. అయితే ఇదిలా ఉంటే వైసీపీ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ పేరుతో కార్యక్రమాన్ని నవంబర్ 9 నుంచి ప్రారంభించింది. గత నెలలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని, ఆ నిర్ణయం ఇప్పుడు ఈ కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు.
వైసిపి ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారానే జరుగుతున్న మంచిని అందరికీ తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.. 53 నెలల కాలం చరిత్రలో నిలిచి పోయెలా పాలన సాగిందని సీఎం వైయస్ జగన్ తెలిపారు. ఇదే లక్ష్యంతో వైసిపి, నాయకులు ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయనుంది. కానీ ఆ కొటేషన్ తోనే టిడిపి పార్టీ వాళ్ళు జగన్ ని సెటైర్లు వేసి ఆడేసుకుంటున్నారు.